సైంటిస్టులు ఇస్తున్న ముందస్తు సూచనలు భయపెట్టేస్తున్నాయి. సమ్మర్ ఎంటర్ అయ్యే సమయానికి భారత్‌కు వచ్చిన కరోనా.. వింటర్ సమయానికల్లా ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు. వేసవి పూర్తయ్యే సమయానికి కల్లా.. కరోనా కేసులకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ జరగకపోతే ఇప్పుడు ఉన్నదానికంటే 100రెట్లు ప్రజలు ప్రమాదంలో పడటం ఖాయం.
స్విట్జర్లాండ్, స్వీడన్‌లకు చెందిన రీసెర్చర్లు సీజనల్ వేరియేషన్ కారణంగా కరోనాలో మార్పులు సంభవిచ్చొంటున్నారు. ఉత్తరార్ధగోళంలో ఇప్పటికే కరోనా ఎంటర్ అయింది. అదే 2020-21నాటికి పూర్తిగా నిర్మూలించలేకపోతే ఉగ్రరూపం దాలుస్తుంది. వేసవితో పోలిస్తే చలికాలం వైరస్ ఇతరులకు సోకడమనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి పలు కారణాలు ఉండటం వల్ల అదుపు చేయడమనేది చాలా కష్టంగా మారిపోతుంది.
మిగిలిన వైరస్ ల కంటే కోవిడ్19 అనేది ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న చోట త్వరగా వ్యాప్తి చెందుతుంది. అని రీసెర్చర్ మ్యాగజైన్ రచయిత డా.రిచర్డ్ తెలిపారు. దీని కోసం ముఖ్యంగా చేయాల్సింది సమ్మర్ పూర్తయ్యే సమయానికి కరోనా కేసులు తగ్గించలేకపోతే చలికాలానికి చాలా పెద్ద స్థాయిలో తీవ్రతను చూడాల్సి వస్తుందని డా.హాడ్‌క్రాఫ్ట్ అన్నారు.
ఇవేమీ పట్టించుకోకపోతే చలికాలం రాగానే జలుబు ఎలా వస్తుందో.. ఫ్లూ ఎలా వ్యాప్తి చెందుతుందో.. అలాగే వైరస్ కూడా త్వరగా అంటుకుంటుందని బాసెల్, స్టాక్ హోమ్ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు.
ఇంగ్లాండ్‌లో కరోనా కారణంగా ఆరుగురు చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షా 16వేల కరోనా కేసులు నమోదు కాగా, దాదాపు 4వేల మంది ఇదే కారణంతో చనిపోయారు.
See Also | జ్యోతిరాదిత్య సింధియా తండ్రి లాగే కాంగ్రెస్‌ను వదిలేశాడా?