India Cough syrup
Cameroon Cough syrup : భారత్ తో తయారైన దగ్గుమందు ( Cough syrup)వల్ల ఆఫ్రికాలోని గాంబియా(Gambia)లో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ మరణాలకు భారతీయ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉందని డబ్ల్యూహెచ్ఓ (WHO) పేర్కొంది. తాజాగా మరో ఆఫ్రికా దేశంలో పలువురు పిల్లలు చనిపోయారు. వీరి మరణాలకు భారత్ కు చెందిన దగ్గుమందే (Indian Cough Syrup) కారణం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామెరూనియన్ అధికారులు ఈ అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు.
మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్ (Cameroon)లో గత కొద్ది నెలలుగా చిన్నారులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి మరణాలకు దగ్గుమందే (Cough syrup) కారణమని అక్కడి అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కానీ ఈ దగ్గుమందులు భారత్‌లో తయారైనవే (India Made Syrup) అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దగ్గుమందు తయారీ లైసెన్స్ నంబరు.. భారత్‌కు చెందిన ఓ సంస్థతో సరిపోలినట్లు తెలుస్తోంది.
కాగా..2022లో గాంబియాలో 60మందికి పైగా చిన్నారులు భారత్ లో తయారైన దగ్గుమందు వల్ల ప్రాణాలు కోల్పోయారు.ఉజ్జెకిస్తాన్ లో 20మంది చిన్నారులు కూడా అలాగే చనిపోయారు. వీటిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను వాడొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలలో ఈ సిరప్‌లు మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపింది. దీనిపై భారత ప్రభుత్వం అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఈక్రమంలో మరోసారి మరో ఆఫ్రికా దేశంలో దగ్గుమందుల వల్లే చిన్నారులు మరణించటం అవి భారత్ కు చెందినవనే అనుమానాలు వ్యక్తం కావటం ఆందోళన కలిగిస్తోంది. కామెరూన్ దగ్గుమందు తాగి 12మంది వరకు చిన్నారులు చనిపోయినట్లుగా తెలుస్తోంది.