Uttarakhand High Court : భర్త,పిల్లల్ని వదిలేసి మరో వ్యక్తితో మహిళ సహజీవనం .. పిటీషన్ వేసిన భర్తకు షాకిచ్చిన హైకోర్టు

భర్త, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యపై భర్త పిటీషన్ వేశాడు. ఆ పిటీషన్ ను విచారించిన కోర్టు అతనికి షాకిచ్చింది.

Uttarakhand High Court : భర్త,పిల్లల్ని వదిలేసి మరో వ్యక్తితో మహిళ సహజీవనం .. పిటీషన్ వేసిన భర్తకు షాకిచ్చిన హైకోర్టు

Uttarakhand HC married woman living relation

Uttarakhand HC married woman living relation: ఇటీవల కాలంలో సహజీనం అనే విధానం పెరుగుతోంది. ఈ విధానం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోందని..వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని వాదనలు వస్తున్నాయి. ఇలా సహజీవనం అనేది వివాదాస్పదంగా మారిన క్రమంలో ఓ మహిళ తన భర్తా, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న కేసు కోర్టుకెక్కింది. ఉత్తరాఖండ్ లో ఓ మహిళ భర్తా, పిల్లను వదిలేసి మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. దీంతో భర్త కోర్టుకెక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ కోరాడు. కానీ కోర్టు సదరు భర్తకు షాకిస్తు.. ఆమె ఇష్టప్రకారమే ఉండొచ్చు అంటూ తీర్పు ఇచ్చింది…

పిటిషన్ వేసిన వ్యక్తి డెహ్రాడున్ కు చెందినవాడు. జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2012 ఫిబ్రవరిలో వివాహమైంది. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాబుకు 10ఏళ్లు, పాపకు ఆరేళ్లు వచ్చాయి. ఆమెకు 37 ఏళ్లు. ఈక్రమంలో ఆమెకు సోషల్ మీడియాలో ఫరీదాబాద్ కు చెందిన ఓ వ్యక్తితో పరిచయమైంది. అతనితో చాటింగ్ లతో చనువు పెరిగింది. అన్నీ మాట్లాడుకునేవారు. దీంతో వారి మధ్య స్నేహానికి మించిన స్థితికి వెళ్లింది. క్రమేపీ అతనిపై ఆమెకు ఇష్టం పెరిగింది. భర్తపై అయిష్టం కూడా పెరిగింది. అంతే ఆమె భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయం అని వ్యక్తి వద్దకు 2022 ఆగస్ట్ 7న వెళ్లిపోయింది. అతనికితో కలిసి సహజీవనం చేస్తోంది.

Nitin Gadkari: 2025 నుంచి అన్ని ట్రక్కుల్లో డ్రైవర్లకు ఏసీ క్యాబిన్లు తప్పనిసరి.. ఫైలుపై సంతకం చేశానన్న కేంద్ర మంత్రి

దీంతో సదరు భర్త తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉంటోందని ఇది ‘అక్రమ నిర్భంధం’అంటూ హైకోర్టును ఆశ్రయించాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఆమె కోర్టులో హాజరుపరచాలని మే4న పోలీసు సూపరింటెండ్ లను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆమె కోర్టుకు హాజరైంది. తన ఇష్టపూర్వకంగా ఫరీదాబాద్ వ్యక్తితో సహజీవనం చేస్తున్నానని..తన భర్తతో కలిసి ఉండటం ఇష్టంలేదనంటూ స్పష్టంచేసింది కోర్టుకు.కోర్టుకు హాజరైన ఆమె తన భర్త తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, తాను అతనితో కలిసి ఉండేది లేదని కోర్టుకు స్పష్టం చేసింది.

ఇలా ఇరువైపు అభిప్రాయాలు విన్న జస్టిస్ పంకజ్ పురోహిత్, జస్టిస్ మనోజ్ తివారీలతో కూడిన ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమెకు ఇష్టమైనట్లుగా ఉండొచ్చు అని తీర్పునిచ్చింది. ఆ తీర్పు విన్న సదరు భర్త షాక్ అయ్యాడు.ఆవేదన వ్యక్తంచేశాడు. అలాగే అతని తరపు న్యాయవాది అరుణ్ కుమార్ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేస్తు…ఇలాంటి తీర్పు వివాహ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతుంది అంటూ ఆందోళన వ్యక్తంచేశారు.

Bombay High Court : మోసపూరిత ఖాతాల ప్రకటనపై బ్యాంకర్లకు ఎదురుదెబ్బ.. ఆర్బీఐ మాస్టర్ సర్క్యూలర్లపై బాంబే హైకోర్టు స్టే