Covid 19 Deaths China Reports First Two Covid 19 Deaths In More Than Two Years
China Covid-19 Deaths : చైనాలో మళ్లీ కరోనా విలయం సృష్టిస్తోంది. దాదాపు రెండేళ్లు తర్వాత చైనాలో కొత్తగా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. జనవరి 2021 నుంచి కరోనాతో మరణించిన వారి సంఖ్య మొదటిసారిగా చైనాలో 2022 మార్చిలో నమోదైంది. డ్రాగన్ చైనాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపాంతరం చెందడంతో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలోనూ కొత్త కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా కరోనా వైరస్ తీవ్రమవుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించిన చైనా.. రెండేళ్ల తర్వాత మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.
కరోనా మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. జీరో కొవిడ్ విధానం (Zero Covid Policy) అనుసరిస్తున్న చైనాలో ఒమిక్రాన్ కేసులు మాత్రం అసలు తగ్గడం లేదు. చైనాలో కోవిడ్ కేసులు పెరగడానికి అక్కడి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటమే కారణమని అంటున్నారు. చైనాలో దేశీయంగా తయారైన కరోనా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేయడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరగడంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. చైనాలో మొత్తం 13 నగరాల్లో పూర్తి లాక్ డౌన్ విధించింది. ఇతర నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈశాన్య ప్రావిన్స్‌లోని జిలిన్ ప్రాంతంలో 3 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
Covid 19 Deaths China Reports First Two Covid 19 Deaths In More Than Two Years
ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో రెండు కరోనా మరణాలతో దేశంలో కరోనావైరస్ మరణాల సంఖ్య 4,638కు చేరింది. చైనా మార్చి 19న కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ నుంచి 2,157 కొత్త కరోనా కేసులను నివేదించింది. ఇందులో మెజారిటీ కేసులు జిలిన్‌లోనే ఉన్నాయి. సరిహద్దుల్లో ప్రావిన్స్ ప్రయాణ నిషేధాన్ని విధించింది. 2019 చివరలో సెంట్రల్ సిటీ వుహాన్‌లో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో 4,636 మరణాలను నమోదు చేసింది. ఏప్రిల్ 2020లో కరోనా మరణాల సంఖ్యను సవరించింది. కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ఆస్ప్రతులు నిండిపోయాయి.. భారీ సంఖ్యలో కొత్త కరోనా మరణాలు నమోదయ్యాయి.
Read Also : China Covid 4th Wave : చైనాలో కరోనా విజృంభణ.. 2ఏళ్ల రికార్డు బ్రేక్.. ఒక్కరోజే భారీగా కేసులు