Everest Base Camp: ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో కొవిడ్-19 పాజిటివ్
నేపాల్ నుంచి పైకి ఎక్కే వారిని అనుమతించడంతో బేస్ క్యాంపుకు వైరస్ పాకినట్లు తెలిపారు.

Covid 19 Found At Everest Base Camp
Everest Base Camp: ప్రపంచమంతా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పైకి చేరింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ లో నేపాల్ నుంచి పైకి ఎక్కే వారిని అనుమతించడంతో బేస్ క్యాంపుకు వైరస్ పాకినట్లు తెలిపారు.
ఈ పేషెంట్ ప్రాథమికంగా అత్యధిక పల్మనరీ ఎడెమాతో కాఠ్మండూలో జాయిన్ అయ్యాడని అంతేకాకుండా హాస్పిటల్ కు చేరినప్పుడే అతనికి పాజిటివ్ గా తేలినట్లు అధికారులు చెబుతున్నారు. అతనితో పాటు పైకి ఎక్కిన టీమ్ అంతా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
17వేల 600 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో కూర్చొన్నప్పుడే మీ ఇమ్యూన్ సిస్టమ్ బలహీనమైపోతుంది. ఆక్సిజన్ కొరత వల్ల ఇలా జరగొచ్చు. ఎవరెస్ట్ కరస్పాండెంట్ అలన్ ఎర్నెట్టె మాట్లాడుతూ.. మీ వేలుకు కాస్త గాయమై రక్తం కారుతున్నా.. ఆక్సిజన్ ఎక్కువగా దొరికే కింది భాగం వరకూ సమస్య తీవ్రత తగ్గదు. ఇలా పైకి ఎక్కడం వల్ల రిస్క్ లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవేమీ పట్టించుకోకుండా పైకి ఎక్కేస్తున్నారు.
సూరజ్ శ్రేష్ఠ అనే హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ వాలంటీర్.. పర్వత వాతావారణం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బేస్ క్యాంప్ ఎక్కువ ఎత్తుగా ఉండడం వల్ల కొవిడ్-19 అనేది తప్పుగాన పాజిటివ్ గా రావొచ్చు.
ఇక్కడ బేస్ క్యాంపులో కొవిడ్ టెస్ట్ చేయడం డాక్టర్లకు కుదరదు. దగ్గు, శ్వాస అందకపోవడం ఇక్కడ సాధారణం. అందుకే బేస్ క్యాంప్ కు వచ్చే ముందే కొవిడ్ టెస్ట్ చేయించుకుని రావాలి. ఈ రూల్స్ కారణంగా స్వయంగా ఆరోగ్యంగా ఉండగలం.
నేపాల్ లో కొవిడ్ ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. నేపాల్ లో 3లక్షల కరోనావైరస్ కేసులు నమోదుకాగా 3వేల మృతులు సంభవించాయి.