అమెరికా యుద్ధాలు చూసింది.కోవిడ్‌లాంటి విలయాన్ని ఇంతవరకు చూడలేదు.

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల మంది అమెరికన్లు మరణిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 10, 2020 / 07:09 PM IST
అమెరికా యుద్ధాలు చూసింది.కోవిడ్‌లాంటి విలయాన్ని ఇంతవరకు చూడలేదు.

Updated On : April 10, 2020 / 7:09 PM IST

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల మంది అమెరికన్లు మరణిస్తున్నారు.

us center for disease control and prevention  తాజా సమాచారం ప్రకారం, అమెరికాలో ఎక్కువమందిని బలితీసున్న విపత్తుల్లో  కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. రోజూ దాదాపు 2 వేల మంది చనిపోతున్నారు. దేశవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరగడంతో పరిస్థితి వారానికి వారం మరింత విషమిస్తోంది. thehill.com లెక్క ప్రకారం మరణాలకు మూడవ ప్రధాన కారణం…కోవిడ్ వైరస్.   

US లో 466,000 పైగా కేసులు నమోదైయ్యాయి. 16,700పైగా మరణాలు. ఈ రేటు ప్రకారం, యూఎస్.. ఇటలీని అధిగమించనుంది. ప్రస్తుతం కరోనావైరస్ మరణాలు ఎక్కువగా ఉన్నదేశం ఇటలీ. 

గుండెజబ్బులతో రోజుకు 1,774 మృతి చెందుతున్నారని న్యూస్‌వీక్ తెలిపింది. 1,641 మంది క్యాన్సర్‌‌తో చనిపోయారు.influenza, pneumonia, ఆత్మహత్య, కాలేయ వ్యాధితో సహా ఇతర సాధారణ మరణాల కంటే COVID-19 సంబంధిత మరణాల సంఖ్య మించిపోయింది.

100,000 నుండి 240,000 మంది మరణాల నేపథ్యంలో ఈ సంఖ్య ఎక్కడో ఒకచోట ఆగిపోతుందని వైట్ హౌస్ మొదట్లో అంచనా వేసింది. The Institute for Health Metrics and Evaluation (IHME) ఈ సంఖ్యను సవరించింది. 60,415 మంది చనిపోనున్నారని నివేదించింది.

మరోవైపు న్యూయార్క్‌లోని పరిస్థితిని చూస్తే కొంత ఆశాజనకంగా ఉంది. ఇక్కడ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య, ఇంటెన్సివ్ కేర్ కేసుల సంఖ్య తగ్గుతోంది. 
 

Also Read | కరోనావైరస్ : లాక్డౌన్ కంటే ముందు రూ.84,461 కోట్లు విత్ డ్రా చేసిన భారతీయులు