ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో తీసిన కరోనా వైరస్ రియల్ ఫొటోస్ విడుదల చేసిన NIAID

ఇప్పటివరకూ మనం కరోనా వైరస్‌కి సంబంధించి గ్రాఫిక్ ఫొటోలు మాత్రమే చూశాం. ఆ వైరస్ ఎలా ఉంటుందో మైక్రోస్కోపిక్ ఫొటోల్లో చూడండీ..ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్ – Covid 19) నిజంగా ఎలా ఉంటుంది. గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నట్లే ఉంటుందా? వేల మందిని చంపుతున్న వైరస్ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఈ ఫొటోల్లో చూడొచ్చు.
అమెరికా… మోంటానాలోని జాతీయ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ వ్యాధుల పరిశోధనా సంస్థ (NIAID)… ఇటీవల కరోనా వైరస్ వాస్తవ చిత్రాల్ని రిలీజ్ చేసింది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఈ ఫోటోలు తీసింది.
కొవిడ్ 19 వైరస్ (కరోనా వైరస్) 2019 డిసెంబర్‌లో చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా గబ్బిలం నుంచీ పాములకూ… పాముల నుంచీ మనుషులకు వ్యాపించింది. ఆ తర్వాత మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది
కరోనా వైరస్‌గా దీన్ని ప్రపంచం పిలుస్తున్నా… సాంకేతికంగా దీనికి కొవిడ్-19 అనే పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). అందువల్ల అందరూ ఇప్పుడు దీన్ని కొవిడ్ 19 అని కూడా పిలుస్తున్నారు. చైనా అధికారులు… ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ వ్యాప్తి ఆగట్లేదు. ప్రపంచ దేశాలకూ ఇదో పెద్ద సమస్యలా తయారైంది.