Drop in COVID alertness could trigger new variant
Covid in China: కరోనా విజృంభణతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కొవిడ్ సమాచారాన్ని సరిగ్గా తెలపకుండా దాచిపెడుతున్న చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభ్యంతరాలు తెలిపింది. కరోనా సమాచారాన్ని తమకు ఎప్పటికప్పుడు అందించాలని చెప్పింది. చైనా అమలుచేసిన పలు కఠిన ఆంక్షలను ఎత్తివేశారు. చైనా నుంచి వస్తున్న ప్రయాణికులకు పలు దేశాలు కరోనా పరీక్షలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చైనా తీరుపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. ఆసుపత్రిలో చేరుతున్న వారిపై, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వారిపై, మృతులపై మరింత సమాచారం అందించాలని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. కరోనా పరిస్థితిపై కచ్చితమైన సమాచారం అందించలని పేర్కొంది. అలాగే, వ్యాక్సిన్లను ఎంతమంది తీసుకున్నారన్న విషయంపై కూడా కచ్చితమైన సమాచారం అందించాలని సూచించింది.
ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తే చైనాతో పాటు ప్రపంచ దేశాలు కరోనా ముప్పుపై మరింత అప్రమత్తంగా ఉండి, దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వోలోని చైనా అధికారులతోనూ ఆ సంస్థ ఉన్నతాధికారులు మాట్లాడారు. కాగా, చైనా నుంచి వచ్చే వారికి అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, భారత్, ఇటలీ, జపాన్, తైవాన్ కరోనా పరీక్షలు చేస్తున్నాయి. చైనా నుంచి ఇంగ్లండ్ వెళ్లాలనుకునే ప్రయాణికులు విమానం ఎక్కకముందే కరోనా నెగిటివ్ రిపోర్టు చూపాలి.
Bharath Jodo Yatra : బీజేపీయే నాకు గురువు .. ఆ పార్టీ నేతలే నాకు మార్గదర్శకులు : రాహుల్ గాంధీ