Bharath Jodo Yatra : బీజేపీయే నాకు గురువు .. ఆ పార్టీ నేతలే నాకు మార్గదర్శకులు : రాహుల్ గాంధీ

బీజేపీయే నాకు గురువు..ఆ పార్టీ నేతలే నాకు మార్గదర్శకులు అంటూ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bharath Jodo Yatra : బీజేపీయే నాకు గురువు .. ఆ పార్టీ నేతలే నాకు మార్గదర్శకులు : రాహుల్ గాంధీ

I consider BJP my 'guru', says Rahul Gandhi

Bharath Jodo Yatra : పొగిడేవారి కంటే విమర్శించేవారే అసలైన శ్రేయోభిలాషులు అని పెద్దలు చెబుతుంటారు. పొగడ్తల కంటే విమర్శలే ఎప్పుడూ మనిషిని అలెర్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా రాజకీయాల్లో పొగడ్తల కంటే విమర్శలే ఎక్కువగా ఉంటుంటాయి. ఈ విమర్శలు కూడా సెటైరిగ్గా ఉంటాయి. అటువంటి సెటైర్ తో రాహుల్ గాంధీ మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘నాకు బీజేపీ గురువు అని..బీజేపీ నేతలనే నా శ్రేయోభిలాషులు,మార్గదర్శకులు అంటూ సెటైర్ వేశారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్రను ప్రారంభించినప్పుడు ఒక సాధారణ పాదయాత్ర లాగే భావించానని..కానీ ఈ యాత్ర తనకు చాలా నేర్పిస్తోందని ప్రతీ అడుగు ఓ పాఠంలా మారుతోందన్నారు. తన జోడో యాత్రను నిరంతరం విమర్శిస్తున్న బీజేపీ నాకు చాలా నేర్పిస్తోందన్నారు. బీజేపీయే నాకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేలా చేస్తోందన్నారు.

బీజేపీ నేతల విమర్శలతో భారత్‌ జోడో యాత్రకు చక్కటి ప్రచారం జరిగిందని రాహుల్‌ తనదైన శైలిలో బీజేపీపై సెటైర్ వేశారు. నేను ఏం చేస్తున్నానో..ఎవరు నాతో కలిసి అడుగులు వేస్తున్నారో..నేను ఎటువంటి దుస్తులు ధరిస్తున్నానో ఇలా అన్నీ బీజేపీ గమనిస్తోందని బీజేపీ ఫోకస్ అంతా నాపైనే ఉందని అందుకు బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ ఎద్దేవా చేశారు. తనను బీజేపీ నేతలు ఎంతగా అర్థం చేసుకున్నారో…ఈ యాత్రలో నేనుకూడా బీజేపీ నేతలను ఇంకా బాగా అర్థం చేసుకున్నానని వారు నాపై చేసే విమర్శలవల్లే ఇది సాధ్యమైంది అంటూ ఎద్దేవా చేశారు.

ఇదే స్థాయిలో బీజేపీ నేతలను నాపై ఇలాగే విమర్శలు చేయాలని కోరుకుంటున్నానన్నారు. అలా చేస్తేనే నాకు వారి భావజాలాన్ని అర్థం చేసుకుంటానని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ విమర్శలు బాగా ఉపయోగపడతాయన్నారు. బీజేపీ కాంగ్రెస్ ను విమర్శించే కొద్దీ మాకు అది ఉపయోగకరంగానే ఉంటుందన్నారు. నాయకులు ఏం చేయకూడదనేది బీజేపీ నేతలు నాకు చేసి చూపిస్తున్నారని..అందుకే వారిని నాకు గురువులుగా భావిస్తున్నానని రాహుల్‌ వ్యాఖ్యానించారు.