Huntington Beach : ఈ రెస్టారెంటులో టీకా తీసుకోనివారికే ఎంట్రీ..!

ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించింది. ప్రపంచ దేశాలు లాక్ డౌన్లు, కరోనా ఆంక్షలు విధించాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే తప్ప అనుమతించడం లేదు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి చేశాయి. కానీ, కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

Restaurant Only Serves Unvaccinated Guests : ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించింది. ప్రపంచ దేశాలు లాక్ డౌన్లు, కరోనా ఆంక్షలు విధించాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే తప్ప అనుమతించడం లేదు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి చేశాయి. కానీ, కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కరోనా టీకా తీసుకున్నవారికి తమ రెస్టారెంట్లోకి నో ఎంట్రీ అంటోంది. కేవలం వ్యాక్సిన్ ఇప్పుడి వరకు వేయించుకోనివారిని మాత్రమే అనుమతిస్తామంటోంది. అదే.. అదే Basilico’s Pasta e Vino.. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్‌ (Huntington Beach)లోని రెస్టారెంట్.. మార్చి 2020లో కరోనా కారణంగా అన్ని రెస్టారెంట్లు మూసివేశారు.

కానీ, ఈ రెస్టారెంట్ మాత్రం అలానే తెరిచి ఉంచిది. సామాజిక దూరంతోపాటు మాస్క్ ధరించడంతో పాటు బహిరంగ డైనింగ్ ఉంటేనే రెస్టారెంట్లు తెరవడానికి అనుమతి ఉంది. ఇన్ డోర్ రెస్టారెంట్లకు అనుమతి లేదు. కానీ, ఈ రెస్టారెంట్ మాత్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. తమ రెస్టారెంట్లలోకి వచ్చే కస్టమర్లు వ్యాక్సిన్ వేయించుకోనట్టు (Unvaccinated Proof) చూపించాలంటోంది. అప్పుడే లోపలికి అనుమతిస్తామంటోంది. అమెరికా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. అమెరికన్ స్వేచ్ఛ, రక్షణ కోసమంటూ ఈ ఇటాలీయన్ రెస్టారెంట్ మాస్క్ లను నిషేధించింది. ఎలాంటి పరిమితులు లేకుండా కస్టమర్లకు సర్వ్ చేస్తూనే ఉంది.

అంతేకాదు.. రెస్టారెంట్ ముందు రెండు సైన్ బోర్డులను కూడా పెట్టింది. Basilico రెస్టారెంట్ యజమాని Tony Roman కూడా ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నట్టు తెలిపాడు. ఇది ప్రజల స్వేచ్ఛకు హానికరమైనదిగా పేర్కొన్నాడు. ఆరెంజ్ కౌంటీలో డెల్టావేరియంట్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో జూలై 27నాటికి కౌంటీలో 453 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బాసిలికో రెస్టారెంట్ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కౌంటీ నివాసితులలో సుమారు 56 శాతం మందికి టీకాలు వేయగా.. 62.5 శాతం నివాసితులకు ఒక మోతాదు అందినట్టు లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదించింది.

ట్రెండింగ్ వార్తలు