Crab in Ear: మహిళ చెవిలో దూరిన పీత.. ఎలా తీశారో తెలుసా

హిళ చెవిలో పీత ఇరుక్కుపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. wesdaisy అనే టిక్ టాకర్ షేర్ చేసిన వీడియోను బట్టి అట్లాంటిక్ తీరంలోని ప్యూయెర్టో రికోలో జరిగినట్లుగా తెలసింది. చెవి లోపల దూరిన పీతను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆమె స్నేహితుడు చేసిన ప్రయోగం ఎట్టకేలకు సక్సెస్ అయింది.

Crab In Ear

Crab in Ear: మహిళ చెవిలో పీత ఇరుక్కుపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. wesdaisy అనే టిక్ టాకర్ షేర్ చేసిన వీడియోను బట్టి అట్లాంటిక్ తీరంలోని ప్యూయెర్టో రికోలో జరిగినట్లుగా తెలసింది. చెవి లోపల దూరిన పీతను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆమె స్నేహితుడు చేసిన ప్రయోగం ఎట్టకేలకు సక్సెస్ అయింది.

టిక్ టాక్ లో అప్ లోడ్ చేసిన వీడియోలో.. పీతను బయటకు తీసేందుకుగానూ ఓ పరికరంతో వ్యక్తి కష్టపడుతున్నాడు. అప్పటికే ప్రయత్నించిన చాలా సార్లు ఫెయిల్ అవుతుండటంతో ఫోకస్ పెంచి కష్టపడ్డాడు. ఆమె బీచ్ లో పడుకుని ఉండగా.. చెవిలోకి పీత (ఎండ్రకాయ) దూరి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

ఒక పరికరం సాయంతో చెవిలోకి దూరిపోయిన జీవిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తుండటంతో మరింతగా లోపలికి వెళ్లింది. అలా చాలా నిమిషాల పాటు ప్రయత్నించామని వీడియో చివర్లో మాత్రమే పోస్టు చేసినట్లు టిక్ టాకర్ చెబుతున్నాడు. పైగా వీడియోను షేర్ చేసి.. ఇది ప్రశాంతంగా కూర్చొని చూసే వీడియో కాదంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు.

Read ALso: బాబోయ్..ఈ పీతల రక్తం లీటర్ ధర రూ.12 లక్షలపైనే..!

ఆ రోజు పీత బయటకు వచ్చేసిందని ఆనందంలో ఇంటికి వచ్చేసిన మహిళ.. మరుసటి రోజు అదే ప్రాంతానికి వెళ్లి ‘ఆటల కోసం పిల్లల్ని పూర్తిగా నీళ్లలో మునగనీయకండి. దయచేసి నీళ్లలోకి వెళ్లి మునిగే సమయంలో ఇయర్ ప్లగ్ లు వాడటం మర్చిపోకండి’ అంటూ వివరించిందామె.