Kid Reaction Seeing Alcohol Bottles : ఫ్రిడ్జ్‌లో మద్యం బాటిల్స్ చూసి చిన్నారి ఆనందం,బుడిబుడి అడుగులేసే వయస్సులోనే ‘చుక్క’కావాలా ఏంటీ..?!

ఫ్రిడ్జ్‌లో మద్యం బాటిల్స్ చూసి చిన్నారి ఆనందం అంతా ఇంతా కాదు..బాటిల్స్ ని చూసి వాటిని టచ్ చేస్తూ తెగ మురిసిపోతోందా చిన్నారి. ఈ వీడియో చూస్తే బుడిబుడి అడుగులేసే వయస్సులోనే ‘చుక్క’కావాలా ఏంటీ..?! అని ఆశ్చర్యపోవటం ఖాయం..మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ ఫన్నీ వీడియోపై..

Kid Reaction Seeing Alcohol Bottles : ఫ్రిడ్జ్‌లో మద్యం బాటిల్స్ చూసి చిన్నారి ఆనందం,బుడిబుడి అడుగులేసే వయస్సులోనే ‘చుక్క’కావాలా ఏంటీ..?!

Kid Reaction Seeing Alcohol Bottles

Updated On : December 7, 2022 / 5:00 PM IST

Kid Reaction Seeing Alcohol Bottles : మద్యం బాటిల్ కనిపిస్తే చాలు మందుబాబుల మొహం మతాబులా వెలిగిపోతుంది.నోట్లో లాలాజలం ఊరిపోతుంది. బాటిల్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి లాగించేద్దామా అని ఉవ్విళ్లూరిపోతారు. చేతులు గురగురలాడిపోతాయి. ఇలా మద్యం బాటిల్ కనిపిస్తే మందుబాబుల ఆనందం అంతా ఇంతా కాదు. కోవిడ్ సమయంలో ఓ బాటిల్ కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూల్లో ఎంత పద్దతిగా నిలబడి కొనుక్కుపోయారో చూశాం. అలా మద్యానికి మందుబాబులకు అవినావభావ సంబంధం..ఆ బంధం గురించి మాటల్లో చెప్పలేదని పెగ్గుల్లో మాత్రమే చెప్పగలిగేది..

ఈ మందుబాబుల మద్యం గోల ఎందుకంటారా? ఎందుకంటే మద్యం బాటిల్ చూస్తే మందుబాబుల నోరు ఊరిపోవటం గురించి విన్నాం..చూసే ఉంటాం. కానీ బుడి బుడి అడుగులేస్తున్న ఓ చిన్నారి మద్యం బాటిల్ చూసి తెగ మురిసిపోవటం చూస్తే వార్నీ నువ్వు కూడా మొదలెట్టేశావామ్మా..అని ఆశ్చర్యపోవాల్సిందే…ఓ ఫ్రిడ్జ్ లో ఉన్న మద్యం బాటిల్స్ చూసి తెగ మరిసిపోతోంది. తెగ ఆనందపడిపోతున్న ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చిన ఒక చిన్నారి ఓపెన్ ఫ్రిజ్ లో ఉన్న మద్యం బాటిల్ చూసి తెగ సంతోషిపడిపోతోంది. ఇంత చిన్న వయసులోనే ఆ చిన్నారికి మద్యం బాటిల్ గురించి ఎలా తెలిసిందా..లేక అదేదో డ్రింక్ అనుకుంటోందో మరి.వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియో @Gulzar_sahab అనే ట్విట్టర్‌ ఖాతాదారు తన ఖాతాలో పోస్ట్ చేశారు.ఇంకా ఈ వీడియో క్యాప్షన్‌లో ‘‘మద్యం కనపడగానే ముఖంలో మెరుపు వచ్చేసింది’’ అని రాసి ఉంది.

కేవలం 24 సెకన్లే ఉన్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. యూజర్లు చేస్తున్న కామెంట్లను చూసి కూడా నవ్వుకోవలసిందే. ఓ యూజర్ ‘బిడ్డకు కూడా తండ్రి బుద్దులే ఉన్నాయ’ని రాస్తే, ‘ఈరోజులు ఇలా తయారయ్యాయ’ని మరో యూజర్ రాశారు. మొత్తం మీద నెటిజన్లు ఈ వీడియో మీరు కూడా ఓ లుక్కేయండీ..