రెస్టారెంట్‌లో panda బొమ్మలతో భౌతికదూరం.. థాయ్ డైనర్లకు కంపెనీ ఇస్తున్నాయి!

  • Published By: srihari ,Published On : May 15, 2020 / 01:25 PM IST
రెస్టారెంట్‌లో panda బొమ్మలతో భౌతికదూరం.. థాయ్ డైనర్లకు కంపెనీ ఇస్తున్నాయి!

Updated On : May 15, 2020 / 1:25 PM IST

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ఈ చర్యల్లో భాగంగా ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని ఆదేశించటం జరిగింది. తాజాగా థాయ్ లాండ్ కేసుల సంఖ్య తగ్గటంతో లాక్ డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. దానిలో భాగంగానే మే నెల ప్రారంభంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ రెస్టారెంట్లును తిరిగి తెరవడానికి వీలు కల్పించింది ప్రభుత్వం.

థాయ్ లాండ్ లోని Maison Saigon రెస్టారెంట్ కొత్త నిబంధనల్లలో భాగంగా రెస్టారెంట్ టేబుల్ వద్ద stuffed panda బొమ్మలను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వారు ఇతరుల నుంచి సామాజిక దూరాన్ని పాటించటంతో పాటు, వారికి ఒక కంపెనీ ఇచ్చినట్లు అవుతుందని రెస్టారెంట్ యజమాని  Natthwut Rodchanapanthkul తెలిపారు.
panda

థాయ్ లాండ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తెరచుకున్నMaison Saigon రెస్టారెంట్ లో సామాజిక దూరం  పాటించటం కోసం ఏర్పాటు చేసిన stuffed panda బొమ్మల పక్కన కూర్చోని ప్రజలు విందును ఆస్వాదిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి సామాజిక దూరంలో భాగంగా ఉపయోగించే stuffed panda బొమ్మలపై ఒక ఉద్యోగి టోపిని పెట్టడం కనిపిస్తుంది. అంతేకాకుండా ఒంటరిగా భోజనం చేయడానికి వచ్చిన సావిత్ అనే వ్యక్తి బొమ్మతో కూర్చొని ఆహారం తినటం నాకు చాలా ఆనందంగా అనిపించిందని అన్నాడు.  
panda

మరొక కస్టమర్ కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత మెుదటిసారి రెస్టారెంట్ కి వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త కంపెనీ కలిగి ఉండటం సంతోషంగా ఉంది అన్నాడు. బ్యాంకాక్ లోని Maison Saigon రెస్టారెంట్ లో కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించటం కోసం stuffed panda బొమ్మలను ఇతరుల మధ్య దూరం పాటించే స్పేస్ కీపర్ లుగా ఉపయోగిస్తున్నారు. 
pandas

థాయ్ లాండ్ లో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత మెుదటిసారిగా కొత్తగా కరోనా వైరస్ కేసులు ఏమి నమోదు కాలేదని ఓ స్థానిక సంస్ధ తెలిపింది. జనవరిలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మెుత్తం 3,018 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి భారీన పడి 56 మంది మరణించారు.