America : భారీ సైబర్ దాడి, రూ. 520 కోట్లు డిమాండ్ చేస్తున్న హ్యాకర్లు

సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యం అని పిలవడే...అమెరికాలో సైబర్ దాడి చోటు చేసుకుంది. ఇది అతిపెద్ద సైబర్ దాడిగా పరిగణిస్తున్నారు. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తునన ఐటీ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై హ్యాకర్లు దాడి చేయడం కలకలం రేపింది.

America

Cyber Attack :  సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యం అని పిలవడే…అమెరికాలో సైబర్ దాడి చోటు చేసుకుంది. ఇది అతిపెద్ద సైబర్ దాడిగా పరిగణిస్తున్నారు. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తునన ఐటీ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై హ్యాకర్లు దాడి చేయడం కలకలం రేపింది. దాడి చేసిన అనంతరం 70 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 520 కోట్లు) ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాడి నుంచి తప్పించుకోవాలంటే..తాము అడిగిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More : Bollywood Actress Divorce : భారీగా భ‌ర‌ణం ఇచ్చి విడాకులు తీసుకున్న బాలీవుడ్‌ సెల‌బ్రెటీలు వీళ్లే!

సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ కెసయాపై దాడి చేయడంతో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించింది. ఇన్ఫరేషన్ టెక్నాలజీ సంస్థ కసేయాకు అమెరికా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, కెనడాతో సహా అనేక దేశాల్లో ఉన్న 200 కంపెనీల డేటాను రాన్ సమ్ వేర్ గ్యాంగ్స్ అటాక్ చేసినట్లు FBI అధికారులు భావిస్తున్నారు. దాడి వెనుక రష్యాతో సంబంధాలున్న రేనమ్స్ వేర్ గ్యాంగ్ ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ గ్యాంగ్ గతంలో కొన్ని మేసెజ్డ్ సర్వీ సర్వీసు ప్రొవైడర్లను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఈసారి తీవ్రత అంచనాలకు మించి ఉన్నట్లు సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో జెనివాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు పాల్గొన్న సంగతి తెలిసిందే. సైబర్ దాడుల అంశం వీరిమధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ దాడులను వీలైనంత త్వరగా అరికట్టడానికి తమతో కలిసి పనిచేయాలని పనిచేయాలని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం.

Read More :Andhra Pradesh : 24 గంటల్లో 2,100 కరోనా కేసులు, 26 మంది మృతి