Andhra Pradesh : 24 గంటల్లో 2,100 కరోనా కేసులు, 26 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 2 వేల 100 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 33 వేల 964 యరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Andhra Pradesh : 24 గంటల్లో 2,100 కరోనా కేసులు, 26 మంది మృతి

Ap Corona

Andhra Pradesh Coronavirus : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 2 వేల 100 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 33 వేల 964 యరోనా యాక్టివ్ కేసులున్నాయి. 12 వేల 870 మంది మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఐదుగురు చొప్పున చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 583 మంది కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,02,128 పాజిటివ్ కేసులకు గాను 18,55,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. 12,870 మంది మరణించారు.

Read More : Vijayawada : బెజవాడలో రోడ్డుపై బ్లెడ్ బ్యాచ్ హల్ చల్

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.

Read More :Dangerous Android Apps : ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌తో జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పాస్‌వర్డ్ దోచేస్తారు..!

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 60. చిత్తూరు 316. ఈస్ట్ గోదావరి 583. గుంటూరు 128. వైఎస్ఆర్ కడప 151. కృష్ణా 114. కర్నూలు 50. నెల్లూరు 160. ప్రకాశం 176. శ్రీకాకుళం 48. విశాఖపట్టణం 75. విజయనగరం 22. వెస్ట్ గోదావరి 217. మొత్తం : 2,100