Chinese Rocket: భూమికి చేరిన చైనా లాంగ్‌మార్చ్‌-5బీ రాకెట్ శకలాలు.. వీడియోను చూశారా..

త వారం చైనా ప్రయోగించిన లాంగ్ మార్క్ -5బి రాకెట్ లోని శకలాలు ఆదివారం ఫిలిప్పిన్స్ లోని సముద్రంలో పడిపోయాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ శకలాలు భూమికి తిరిగి వచ్చే క్రమంలో..

Chinese Rocket: భూమికి చేరిన చైనా లాంగ్‌మార్చ్‌-5బీ రాకెట్ శకలాలు.. వీడియోను చూశారా..

China

Updated On : July 31, 2022 / 9:27 PM IST

Chinese rocket: గత వారం చైనా ప్రయోగించిన లాంగ్ మార్క్ -5బి రాకెట్ లోని శకలాలు ఆదివారం ఫిలిప్పిన్స్ లోని సముద్రంలో పడిపోయాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ శకలాలు భూమికి తిరిగి వచ్చే క్రమంలో చాలా వరకు కాలిపోయాయి. కొన్ని శకలాలు సముద్రంలో పడిపోయాయి.

China Rocket: చైనా రాకెట్ కూలింది.. పెను ప్రమాదమే తప్పింది

అయితే రాకెట్ శకలాలు భూమికి చేరే సమయంలో మలేషియాలోని పలువురు వీటిని చూసినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. యూఎస్ లోని సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ లోని ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్ డోవెల్ రాకెట్ శకలాలు భూమికి చేరుతున్న క్రమంలో తీసిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

బూస్టర్ హిందూ మహాసముద్రం మీదుగా తిరిగి ప్రవేశించిందని ధృవీకరించగలిగినప్పటికీ, ప్రభావ స్థానంతో సహా ‘సాంకేతిక అంశాలపై వివరాల కోసం’ చైనాను సూచించినట్లు US అంతరిక్ష అధికారులు తెలిపారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వారి లాంగ్ మార్చ్-5బీ రాకెట్ తిరిగి భూమిపై పడిపోయినందున నిర్దిష్ట సమయ సమాచారాన్ని పంచుకోలేదని NASA అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ విడిగా ట్వీట్ చేశారు.