China : మహిళ కంట్లో 60 బ్రతికున్న పురుగులు.. అరుదైన కేసుగా చెబుతున్న వైద్యులు

చైనాలో ఓ మహిళ కంట్లోంచి 60 బ్రతికున్న పురుగులను వైద్యులు తొలగించడం సంచలనంగా మారింది. ఈ కేసును అరుదైనదిగా వైద్యులు చెబుతున్నారు.

China : మహిళ కంట్లో 60 బ్రతికున్న పురుగులు.. అరుదైన కేసుగా చెబుతున్న వైద్యులు

China

China : ఓ మహిళ కంట్లో 60 లైవ్ వార్మ్‌లు కాపురం పెట్టేశాయి. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు వాటిని బయటకు తీయడంతో అందరూ షాకయ్యారు. చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Delhi : చైనా, అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధిక క్యాన్సర్ కేసులు.. ఆందోళన కలిగిస్తున్న కేంద్ర గణాంకాలు

కంట్లో నలక పడితేనే ఇబ్బంది పడతాం. దానిని బయటకు తీసేవరకు ఇరిటేట్ అవుతాం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు కంట్లో 60 బతికున్న పురుగులు తిరుగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? చైనాలో ఓ పేషెంట్ కంటికి ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ 60 బతికున్న పురుగులను బయటకు తీశారు. మిర్రర్ ప్రకారం ఓ మహిళ కొద్దిరోజులుగా కళ్లు విపరీతమైన దురదను ఎదుర్కుంటోంది. ఒకసారి కళ్ళు రుద్దిన తర్వాత పురుగు కిందపడటం చూసి తీవ్ర ఆందోళనకు గురైందట. వెంటనే చైనా కున్మింగ్ లోని ఆసుపత్రికి వెళ్లేసరికి పరీక్షలు చేసిన వైద్యులు ఆమె కనుబొమ్మలు, కనురెప్పల మధ్య ఖాళీల్లో పురుగులు ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు.

Mystery Disease : చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్.. అలర్ట్ అయిన భారత్

ఆ మహిళకు వెంటనే శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ గువాన్ కుడి కంటి నుండి 40 కంటే ఎక్కువ, ఎడమ కంటి నుండి 10 సజీవ పురుగులను తొలగించారు. మొత్తంగా 60 బ్రతికున్న పురుగులు తొలగించారు. ఇది అరుదైన కేసుగా డాక్టర్ గువాన్ చెప్పారు. ఇవి సాధారణంగా ఈగ కాటు ద్వారా వ్యాప్తి చెందుతాయని వెల్లడించారు. లేదంటే జంతువులను తాకిన తర్వాత అదే చేత్తో కళ్లను రుద్దడం వల్ల కూడా ఇలా జరగవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇంకా ఆ పురుగు తాలుకూ లార్వా అవశేషాలు ఉన్నాయేమో పర్యవేక్షించడానికి తరచూ చెకప్ కి రావాలని ఆ మహిళను వైద్యులు కోరారు. పెంపుడు జంతువులను తాకిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలని కూడా ఆమెకు సూచించారు.