×
Ad

Viral Video : ఈ శునకం తెలివితేటలు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..ఇంతకీ ఏం చేసిందంటే..

శునకాలు చాలా తెలివిగా ఉంటాయి. యజమాని వాటికి ఏదైనా నేర్పితే అది చక్కగా నేర్చుకుంటాయి. ఓ శునకం తెలివితేటలు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

Viral Video

Viral Video : శునకాలు చాలా తెలివిగా ఉంటాయి. వాటికి ఏ పని నేర్పినా చక్కగా నేర్చుకుంటాయి. సోషల్ మీడియాలో శునకాలకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఔరా అనిపిస్తున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఓ డాగ్ వీడియో చూస్తే దాని తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేరు.

సారూ.. ఈ వయసులో బ్యాటింగ్ అవసరమా? బ్యాటింగ్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

కుక్కలు ఎంతో విశ్వాసంతో ఉంటాయి. ఎంతో అభిమానంగా చూసుకునే యజమాని పట్ల ఎంతో నమ్మకంతో ఉంటాయి. తమకు నీడ నిచ్చిన ఇంటిపై ఈగ వాలినా ఒప్పుకోవు. ఓ డాగ్ తెలివితేటలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాని తెలివి ముందు మనుష్యులు కూడా పనికిరారు అనిపిస్తుంది. earth_naturle అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ శునకం బజారుకెళ్లి ఇంటికి కావాల్సిన కూరగాయలు కొని తీసుకువచ్చింది. ముచ్చట గొలుపుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Salman Khan : మ్యారేజ్ బ్యూరో ప్రకటనలో సల్మాన్ ఖాన్ ఫోటో.. వైరల్ అవుతున్న మ్యాట్రీమోనీ యాడ్

యజమాని ఇచ్చిన బుట్ట పట్టుకుని కూరగాయలు కొనడానికి మార్కెట్‌కి వచ్చింది శునకం. కూరగాయలు అమ్మే మహిళకు తన కాలితో సైగ చేస్తూ తనకు కావాల్సినవి చూపించింది. బాస్కెట్‌లో ఉన్న డబ్బులు తీసుకుని మహిళ కూరగాయలు ఇచ్చింది. ఇలాగే మరో మహిళ దగ్గర శునకం కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్లిపోయింది. ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసాడు. ఇక్కడ కూరగాయలు ఎలా కొనాలో శునకానికి  నేర్పిన యజమానిని కూడా అభినందించాలి. యజమాని చెప్పిన పని చక్కగా చేసి పెట్టిన శునకాన్ని అందరూ అభినందిస్తున్నారు.