Salman Khan : మ్యారేజ్ బ్యూరో ప్రకటనలో సల్మాన్ ఖాన్ ఫోటో.. వైరల్ అవుతున్న మ్యాట్రీమోనీ యాడ్
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున సల్మాన్ ఖాన్ పేరు చెబుతారు. ఆయన సింగిల్ స్టేటస్‌ని క్రియేటివ్‌గా వాడుకుంది ఓ మ్యారేజ్ బ్యూరో.. ఇంతకీ విషయం ఏంటి? చదవండి.

Salman Khan
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల పుట్టినరోజు జరుపుకున్నారు. అనేకమంది ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సామాన్యులు సైతం సోషల్ మీడియాలో సల్లూ భాయ్‌కి విషెస్ చేసారు. అయితే ఓ మ్యారేజ్ బ్యూరో సల్మాన్‌కి శుభాకాంక్షలు చెప్పిన తీరు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Salman Khan
Natti Kumar : నేనూ వ్యూహం సినిమా చేస్తా.. వాళ్ల అరాచకాలపై నా సినిమాలో చూపిస్తా
సల్లూ భాయ్‌కి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు. ఇటీవల 58 వ పుట్టినరోజు జరుపుకున్న సల్మాన్ ఖాన్‌కి కోట్లాదిమంది శుభాకాంక్షలు చెప్పారు. కొందరు ప్రత్యక్షంగా ఆయనను కలిసేందుకు ఇంటికి కూడా వెళ్లారు. ఈ సందర్భంలోనే ఓ మ్యారేజ్ బ్యూరో ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంలో శుభాకాంక్షలు చెబుతూ ఆ బ్యూరో నిర్వాహకులు వార్తా పత్రికలో యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ ద్వారా వారి క్రియేటివిటీని చాటుకున్నారు.
ప్రముఖ కార్టూనిస్టు సతీష్ ఆచార్య తన ట్విట్టర్ ఖాతాలో (@satishacharya) పోస్టు చేసిన యాడ్ చూసి అందరూ షాకవుతున్నారు. అందులో ఏముంది? అంటే.. అది ఓ కన్నడ పేపర్‌లో ప్రచురించిన యాడ్. మంగళూరుకి చెందిన ‘సుమంగళ’ అనే మ్యారేజ్ బ్యూర్ ఆ యాడ్ ఇచ్చింది. యాడ్‌లో సల్మాన్ ఖాన్ ఫోటోతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే పెళ్లికానివారు సంప్రదించమంటూ ఆ బ్యూరో వివరాలు ఇచ్చింది. బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరూ అంటే సల్మాన్ పేరు ఠక్కున చెబుతారు. సల్లూ భాయ్‌లాగ పెళ్లి కానివారంతా తమను సంప్రదించమంటూ చాలా తెలివిగా ఆ బ్యూరో నిర్వాహకులు ఇచ్చిన యాడ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
కెప్టెన్ విజయ్‌కాంత్ గురించి 15 ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా?
ఇక నెటిజన్లు ఈ బ్యూరో ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం కొత్తకాదని రిప్లై చేసారు. గతంలో ఐశ్వర్య, షారుఖ్ ఖాన్ వంటి వారి ఫోటోలతో ప్రకటనలు ఇచ్చారని చెప్పారు. ‘భాయి జాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో?’ అని కొందరు.. ‘సింగిల్స్‌కి సల్మాన్ భాయ్ ఒక ఉదాహరణ’ అని కొందరు కామెంట్లు పెట్టారు. ఏది ఏమైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే పెళ్లికాని వారు సంప్రదించమంటూ పెళ్లి కాని సల్మాన్ ఫోటోను క్రియేటివ్‌గా వాడేసిన సుమంగళ మ్యారేజ్ బ్యూరో తెలివితేటలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. బిజినెస్ చేయాలంటే ఇలాంటి తెలివితేటలు కూడా ఉండాలి మరి.
Found this creative advertisement in a Kannada newspaper, to wish @BeingSalmanKhan on his birthday. Issued by Sumangala Marriage Bureau in Mangaluru, this advt says, to get married soon contact us ? #SalmanKhan? pic.twitter.com/HSgdLMw5gy
— Satish Acharya (@satishacharya) December 27, 2023