Natti Kumar : నేనూ వ్యూహం సినిమా చేస్తా.. వాళ్ల అరాచకాలపై నా సినిమాలో చూపిస్తా

సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Natti Kumar : నేనూ వ్యూహం సినిమా చేస్తా.. వాళ్ల అరాచకాలపై నా సినిమాలో చూపిస్తా

Natti Kumar

Updated On : December 28, 2023 / 2:21 PM IST

Vyooham Movie : సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ ఒక డైరెక్టర్.. వైసీపీ వాళ్లు డబ్బులిస్తే వ్యూహం సినిమా తీశాడు.. డబ్బులిచ్చారు కాబట్టి వైసీపీపై ఆర్జీవీకి సానుభూతి ఉంటుందని అన్నారు. కానీ, సినిమాలు చూసి ప్రజలు ఓట్లేసే రోజులు పోయాయని అన్నారు. వ్యూహం సినిమాను నేనుకూడా చేస్తా.. వైసీపీకి వ్యతిరేకంగా సినిమా మొదలు పెడతానని నట్టి కుమార్ అన్నారు.

Also Read : DMDK Founder Vijayakanth passes away : విజయ్‌కాంత్‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిసార్లు పోటీ చేశారు.. ఎన్నిసార్లు గెలుపొందారో తెలుసా?

రఘురామ కృష్ణంరాజుపై చిత్ర హింసలు, వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది, వైసీపీ అరాచకాలపై సినిమాలుతీసి సమాధానం చెబుతా నని నట్టి కుమార్ అన్నారు. వివేకానంద మర్డర్ ఎవరు చేశారో చెప్పలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఉందని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ మొత్తం టీడీపీవైపు ఉంది. ప్రస్తుతం సినీ రంగo భయంతో ఉంది. త్వరలో టీడీపీకి మద్దతుగా అందరూ వస్తారని నట్టి కుమార్ చెప్పారు.

Also Read : Captain Vijayakanth : కెప్టెన్ విజయ్‌కాంత్‌ సినీ ప్రస్థానం.. 20కి పైగా పోలీస్ పాత్రలు.. ఒకే సంవత్సరం 18 సినిమాలు.. 150కి పైగా సినిమాలు..

రాష్ట్ర ప్రజల బాగుకోసం నేను టీడీపీని సపోర్ట్ చేస్తున్నా.. చంద్రబాబును త్వరలోనే కలిసి నా ప్రత్యక్ష రాజకీయాలపై కార్యాచరణ ప్రకటిస్తానని నట్టికుమార్ అన్నారు. విశాఖలో సినీ రంగానికి ప్రభుత్వ స్టూడియో నిర్మాణం కావాలని లోకేశ్ కోరడం జరిగిందని, సినిమా హబ్ గా విశాఖను తీసుకువస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ – జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని, వైసీపీ 29 సీట్లకు పరిమితం అవుతుందని నట్టి కుమార్ జోస్యం చెప్పారు.