Donald Trump: నన్ను ఇంకా మిస్ అవుతున్నారా.. పెళ్లి వేడుకలో ట్రంప్ ప్రచారం

ఎన్నికల్లో 75 మిలియన్ ఓట్లు ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు. మీరు నన్ను ఇంకా మిస్స్ అవుతున్నారా..

Donald Trump: నన్ను ఇంకా మిస్ అవుతున్నారా.. పెళ్లి వేడుకలో ట్రంప్ ప్రచారం

Donald Trump

Updated On : March 30, 2021 / 6:41 AM IST

Donald Trump: అది జాన్ అరిగో, మేగన్ నాడరర్ ల పెళ్లి తంతు. శనివారం మార్ ఏ లాగో వేదికగా జరుగుతుంది. సడన్ గా మాజీ ప్రెసిడెంట్ నేను మీకు గుర్తులేనా.. అంటే తన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అంతే.. అక్కడకు వచ్చిన వాళ్లంతా షాక్ లో నోరెళ్ల బెట్టారు.

ఈ సందర్భంగా అతను మాట్లాడుతున్న వీడియోలో చైనా,ఇరాన్ లపై ప్రస్తుత అధ్యక్షుడు ప్రవర్తిస్తున్న తీరు ఆమోదయోగ్యంగా లేదని చెప్తున్నట్లుగా ఉంది.

నాకు ఈ స్ప్లాష్ రిపోర్ట్స్ అన్నీ అందుతున్నాయి. చైనా గురించి, ఇరాన్ గురించి నాకు చెబుతున్నారు. మీరు డీల్ చేసుకుని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంకా బైడెన్ అమల్లో ఉన్న వాటిని తగ్గించి భేరాలకు దిగుతాడు.

సరిహద్దులేమీ సరిగ్గా లేవు. ఎన్నికల్లో 75 మిలియన్ ఓట్లు ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు. మీరు నన్ను ఇంకా మిస్స్ అవుతున్నారా.. అంటూ అడిగి వధూవరులను గ్రేట్ కపుల్ అని ఆశీర్వదించారు.

మార్ ఏ లాగో, ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ లలో ట్రంప్ తో పాటుగా జాన్ అరిగో సభ్యులు.