Afghanistan Double Blasts: ఆఫ్గనిస్థాన్‌‌లో జంట బాంబు పేలుళ్లు.. ఏడుగురు దుర్మరణం

ఆప్గనిస్థాన్‌లో హింస కొనసాగుతూనే ఉంది. పశ్చిమ కాబూల్‌లో శనివారం రెండు బస్సుల్లో వరు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబుదాడిల్లో కనీసం ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Afghanistan Double Blasts : ఆప్గనిస్థాన్‌లో హింస కొనసాగుతూనే ఉంది. పశ్చిమ కాబూల్‌లో శనివారం రెండు బస్సుల్లో వరు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబుదాడిల్లో కనీసం ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మైనారిటీ హజారా కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న పరిసర ప్రాంతాల్లో ఈ జంట బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ నెల ప్రారంభంలో బస్సులపై ఇలాంటి దాడులు జరగగా.. దాదాపు 12 మంది పౌరులు మృతిచెందారు.

శనివారం (జూన్ 12) జరిగిన పేలుళ్లలో ఏడుగురు వరకు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారని కాబూల్ పోలీసు ప్రతినిధి బసిర్ ముజాహిద్ తెలిపారు. సెప్టెంబర్ 11 నాటికి విదేశీ బలగాలు దేశం నుంచి వైదొలగడంతో హింస మరింత పెరుగుతోంది. ఆఫ్ఘన్ ప్రభుత్వం తిరుగుబాటు తాలిబాన్ల మధ్య శాంతి పరిష్కారానికి ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా జరిగిన వరుస బాంబు దాడుల వెనుక ఎవరున్నారో ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌లో హజారా సమాజం లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. మే నెలలో ఈ ప్రాంతంలోని ఒక పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 80 మంది మరణించగా.. వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు