Covid Sub Variant : సింగపూర్‌లో మరో కరోనా వేవ్.. పీక్‌ స్టేజ్‌లో ప్రతి రోజు 15 వేల కేసులు నమోదు..!

సింగపూర్‌లో మరో కరోనా వేవ్‌ కలకలం రేపుతోంది. ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్‌వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ పేర్కొన్నారు.

Covid Sub Variant : సింగపూర్‌లో మరో కరోనా వేవ్.. పీక్‌ స్టేజ్‌లో ప్రతి రోజు 15 వేల కేసులు నమోదు..!

covid wave

Updated On : October 16, 2022 / 6:55 AM IST

driven by xbb sub variant : సింగపూర్‌లో మరో కరోనా వేవ్‌ కలకలం రేపుతోంది. ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు 54 శాతంపైగా కరోనా కేసులు ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్‌వేనని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, డెన్‌మార్క్‌, భారత్‌, జపాన్‌తో సహా 17 దేశాల్లో ఈ కరోనా వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్ విజృంభణతో తమ దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని వెల్లడించారు.

అలాగే కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా తిరిగి వ్యాపిస్తుందని తెలిపారు. మరోవైపు ఎక్స్‌బీబీ సబ్‌ వేరియంట్‌ వల్ల కరోనా కేసులు నవంబర్ నెల మధ్యలో గరిష్ఠస్థాయికి చేరవచ్చని సింగపూర్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ వేవ్‌ పీక్‌ స్టేజ్‌లో ప్రతి రోజు సగటున 15,000 కేసులు నమోదు కావచ్చని అంచనా వేసింది. అయితే ఈ వేవ్‌ స్వల్ప కాలం పాటు ఉండవచ్చని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్పారు.

Covid-19: ఇండియా కరోనా ఫోర్త్ వేవ్‌ను ఎదుర్కోనుందా..!
తాజా కరోనా పరిస్థితిని, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేయడంతోపాటు సురక్షిత పద్ధతులను అమలు చేస్తామని ఓంగ్ యే కుంగ్ అన్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అక్టోబర్ 14 నాటికి సింగపూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,997,847కు, మొత్తం మరణాల సంఖ్య 1,641కు చేరింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.