Drone Attack: సౌదీ అరేబియా ఎయిర్‌పోర్టులో డ్రోన్ దాడి

సౌదీ అరేబియాలోని అభా ఎయిర్‌పోర్టులో డ్రోన్ దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైగా గాయాలకు గురైనట్లు అధికారులు చెప్తున్నారు.

Drone Attack: సౌదీ అరేబియాలోని అభా ఎయిర్‌పోర్టులో డ్రోన్ దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైగా గాయాలకు గురైనట్లు అధికారులు చెప్తున్నారు. పొరుగుదేశమైన యెమన్ దేశంతో వచ్చిన పొరపచ్చాల కారణంగా ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రెండో డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందని తెలియడంతో ముందుగానే అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ విషయాన్ని కింగ్‌డమ్ అఫీషియల్ ఎల్ ఏఖ్‌బరియా టెలివిజన్ ఛానెల్ ధ్రువీకరించింది.

‘ఘటనలో ఎనిమిది గాయాలకు గురవడంతో పాటు సివిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా డ్యామేజి అయిందని’ ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిసింది. ఎయిర్‌పోర్టుపై రెండో దాడి జరిగితే యుద్ధ వాతావరణం కనిపించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

మొదటి దాడిలో భాగంగా ఎల్ ఏఖ్‌బారియా ప్రకారం.. రన్ వే బాగా దెబ్బతింది. ఎయిర్‌‌పోర్టుపై పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్ అటాక్ చేసే సమయంలో దానిని ముందుగానే కూల్చేసేందుకు సౌదీ మిలటరీ ప్రయత్నం చేసింది. గడిచిన 24 గంటల్లో ఈ ఎయిర్‌‌పోర్టుపై డ్రోన్ అటాక్‌ జరగడం ఇది రెండోసారి.

ట్రెండింగ్ వార్తలు