Male Priest Mummy : 100 ఏళ్లుగా మగవాడని అనుకుంటే..గర్భిణి అని తెలిసి షాక్..

100 సంవత్సరాల నుంచి మగవాడని అనుకుంటే గర్భంతో ఉన్నట్లు తెలిసి దేశమంతా షాక్ అయిన ఘటన ఈజిప్టులో జరిగింది.

Mummy Male Priest Turns Out Pregnant Woman : 100 సంవత్సరాల నుంచి మగవాడని అనుకుంటే గర్భంతో ఉన్నట్లు తెలిసి దేశమంతా షాక్ అయిన ఘటన ఈజిప్టులో జరిగింది. అదేంటీ ఓ మనిషి 100ల నుంచి మగవాడని ఎలా అనుకున్నారు? అసలు అన్ని ఏళ్లు బతికి ఉండటమే మిరాకిల్ అనుకుంటే గర్భవతి అని తెలియటమేంటీ? ఇదేదో గందరగోళంగా ఉందనుకుంటున్నారా? ఇది జరిగింది ఈజిప్టులో అని చెప్పగానే అర్థం అయి ఉండాలే. అది జీవించి ఉన్న మనిషికాదు ‘మమ్మీ’అని..ఔను..అతను అతను కాదు ఆమె. అని తెలిసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా పరిశోధలను చేసే శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. దాదాపు శతాబ్దానికి (100 ఏళ్లు) పైగా ఓమమ్మీది పురుషుడు అనుకుంటున్నామని కానీ ఈ మమ్మీ మహిళదని.. పైగా ఆ మహిళ (మమ్మీ) గర్భవతి అని తెలిసి పురావస్తు శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు.

19వ శతాబ్దంలో పోలాండ్‌లోని నాసెంట్‌ యూనివర్శిటీ ఆఫ్‌ వార్సా పురాతన వస్తువులను సేకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో వారు ఓ పురుషుడు అని భావించిన ఓ పూజారి మమ్మీని తీసుకువచ్చారు. అలా 100 ఏళ్లకు పైగా ఆ మమ్మీని హోర్-దేహుతి అనే పురాతన ఈజిప్టు పూజారిది అనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ అది ఓ గర్భిణిది అని తేలటంతో వారు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో వార్సా మమ్మీ ప్రాజెక్ట్‌లోని శాస్త్రవేత్త మార్జెనా ఓజారెక్-స్జిల్కే నేషనల్‌ మ్యూజియంలో ఉన్న మమ్మీకి గురువారం (ఏప్రిల్ 29,2021) సీటీ స్కాన్‌ నిర్వహిస్తుండగా ఆశ్యర్యానికి గురి చేసింది.

ఈ షాకింగ్ విషయంపై ఓజారెక్-స్జిల్కే మాట్లాడుతూ.. ‘నేను సదరు మమ్మీ జననేంద్రియాలను పరిశీలిస్తుండగా.. లోపల నాకు చిన్న పాదం లాంటిది కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన నేను శాస్త్రవేత్త అయిన నా భర్తను పిలిచి..అదే విషయాన్ని తెలిపారు. తను కూడా షాక్ అయ్యారు. ఆతరువాత ఆయన కూడా ఆ మమ్మీని పరిశీలించి నిజమే అంటూ షాక్ అయ్యారు. ‘‘అవును నీకు కనిపించింది పాదమే. ఈ మమ్మీ గర్భవతి. మమ్మీ కడుపులో బిడ్డ ఉంది. ఆ పిండం వయసు 26-28 వారాల మధ్య ఉంటుంది’’. ‘ఇన్నాళ్లు మనం పురుషుడుగా భావిస్తున్న ఈ మమ్మీ మహిళ. తన వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది’’ అని నా భర్త తెలిపారు. ఆయన చెప్పిన విషయం నన్నే కాదు నా భర్తను కూడా షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే దాదాపు 100 ఏళ్లకు పైగా సదరు మమ్మీని పురుషుడిగా భావించాం. కానీ ఆ మమ్మీ పురుషుడు కాదనీ మహిళ అని.. అందునా గర్భవతి అని తెలిసి చాలా చాలా చాలా షాకయ్యాం’’ అని తెలిపారు ఓజారెక్‌.

‘‘సదరు మహిళ మృతికి కారణం సరిగా తెలియలేయడం లేదు. కాకపోతే గర్భం వల్లనే ఆమె మరణించి ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఎంతో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో..అటువంటి వైద్య సదుపాయంకూడా అందుబాటులో ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా ముందుగా తెలుసుకునే వాళ్లం. కానీ అప్పట్లో అలా కాదు. పైగా మూఢనమ్మకాలు బాగా ఎక్కువగా ఉండే ఈజిప్టులో ఉండేవి. ఇక ఈ మమ్మీ స్త్రీ అని.. అందునా గర్భవతి అని తెలిసిన నాటి నుంచి ఎన్నెన్నో ప్రశ్నలు..అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పురాతన ఈజిప్టు సమాజంలో మహిళల జీవిన విధానం ఎలా ఉండేది.. ఈజిప్టు మతాచారాల ప్రకారం పిల్లలను ఎలా చూసేవారు.. గర్భంలోని పిండానికి కూడా పునర్జన్మ, ఆత్మ వంటివి వర్తిస్తాయని భావించేవారా? వంటి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. వాటి గురించి అంతులేని ప్రశ్నలపై అధ్యాయనం చేయాల్సి ఉందని అవన్నీ ఓ కొలిక్కి వస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని అన్నారు ఓజారెక్‌.

ట్రెండింగ్ వార్తలు