Egyptian Mummy: ఇప్పటికీ 3వేల 500ఏళ్ల నాటి ఈజిప్షియన్ మమ్మీ పళ్లు

ఈజిప్టులో మమ్మీలుగా మార్చిన రాజులు, రాజవంశీకులు, మత గురువులు ఇప్పటికీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారు. క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం తర్వాత తొలిసారి సైంటిస్టులు ఓ మమ్మీని

Egyptian Mummy: ఈజిప్టులో మమ్మీలుగా మార్చిన రాజులు, రాజవంశీకులు, మత గురువులు ఇప్పటికీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారు. క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం తర్వాత తొలిసారి సైంటిస్టులు ఓ మమ్మీని కనుగొని దాని పైపొరను జాగ్రత్తగా తొలగించారు.

1525 నుంచి 1504మధ్య కాలంలో పాలించిన ఫారోహ్ అమెన్హోతెప్ మమ్మీగా కన్ఫామ్ చేసుకున్నారు సైంటిస్టులు. ప్రస్తుత కాలంలో ఇప్పటివరకూ ఓపెన్ చేయని ఒకే ఒక్క రాయల్ మమ్మీ ఇదే. చనిపోయినప్పుడు 35 సంవత్సరాల వయస్సున్న వ్యక్తిగా ఈ పరీక్షల్లో తేలింది. 169 సెంటిమీటర్ల పొడవు, మంచి శరీర ధారుడ్యంతో మరణించాడు. ఎటువంటి గాయాలు లేకపోవడంతో సహజ కారణాలతో మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఫ్రంటియర్స్ ఇన్ మెడిసన్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. మమ్మీపై పరిశోధనలు జరిపి ఫిజికల్ అప్పీయరెన్స్, హెల్త్, చనిపోవడానికి కారణం, మమ్మీఫికేషన్ స్టైల్ ను విశ్లేషించారు. స్కానింగ్ నిర్వహించి 2 డైమన్షనల్, 3డైమన్షనల్ ఇమేజెస్ తయారుచేశారు. అందులో హెడ్ మాస్క్, బ్యాండేజెస్ తొలగించి కొత్త రూపాన్ని సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి : దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్

చిన్న గడ్డం, పొడవాటి ముక్కు, రింగుల జట్టుతో అతని తండ్రికి దగ్గరిపోలికలు ఉన్నాయట. చనిపోవడానికి కారణం గురించి తెలియలేదు. మొదటిసారి పాతిపెట్టిన తర్వాత సమాధి దొంగలు దొంగిలించగా తిరిగి రెండో సారి మమ్మీని చేసినట్లుగా తెలుస్తుంది.

కైరీ యూనివర్సిటీ సహార్ సలీమ్ .. ‘ప్రస్తుత కాలం వరకూ ఓపెన్ చేయని ఒకే ఒక్క మమ్మీ అమెన్ హోతెప్ దే. రెండు సార్లు అతణ్ని ఎలా పాతిపెట్టారనే కాదు. అంతకుముందు అతనికేం చికిత్స చేశారో కూడా తెలుసుకోవడానికి సహాయపడుతుంది’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు