Hyderabad Omicron : దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్

దుబాయ్ నుంచి వచ్చిన 15 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అతడికి కాంటాక్ట్ ఉన్నవారిలో ముగ్గురికి కరోనా సోకింది. వీరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు

Hyderabad Omicron : దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్

Hyderabad Omicron

Hyderabad Omicron : దేశంలో ఒమిక్రాన్ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 241 మంది డిశ్చార్జ్ కాగా.. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 62 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయ్యారు.

చదవండి : Omicron: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మూడో వేవ్ వచ్చేస్తుందా?

ఇక ఇదిలా ఉంటే 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన 15 ఏళ్ల బాలుడికి కరోనా నిర్దారణ అయింది. ఇతడు తన కుటుంబంతో కలిసి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్‌లో ఉంటున్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన అతడికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో జీనోమ్ సీక్వెన్సీకి పంపారు. పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్దారణ అయింది.

చదవండి : Omicron Variant: ఒమిక్రాన్ వైరస్ హెల్త్ కేర్ సిస్టమ్స్‌పై తీవ్ర ఇబ్బంది చూపించడం ఖాయం

దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. బాలుడికి ప్రైమరీ కాంటాక్టు ఉన్న 40 మందికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. అయితే ముగ్గురు కుటుంబ సభ్యులకు పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సీకి పంపారు. వారందరికి కూడా ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. దీంతో బాధితులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.