Omicron Variant: ఒమిక్రాన్ వైరస్ హెల్త్ కేర్ సిస్టమ్స్‌పై తీవ్ర ఇబ్బంది చూపించడం ఖాయం

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అడ్డుకోవడానికి చైనా, జర్మనీ కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చాయి. డెల్టా తీవ్రతతో పోలిస్తే ఒమిక్రాన్ కు అంతగా భయపడాల్సిన అవసర్లేదని స్టడీలు..

Omicron Variant: ఒమిక్రాన్ వైరస్ హెల్త్ కేర్ సిస్టమ్స్‌పై తీవ్ర ఇబ్బంది చూపించడం ఖాయం

Omicron Case

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అడ్డుకోవడానికి చైనా, జర్మనీ కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చాయి. డెల్టా తీవ్రతతో పోలిస్తే ఒమిక్రాన్ కు అంతగా భయపడాల్సిన అవసర్లేదని స్టడీలు చెబుతున్నప్పటికీ.. ఈ వేరియంట్ హెల్త్ కేర్ సిస్టమ్ పై దారుణమైన ప్రభావం చూపిస్తుందని WHO మంగళవారం హెచ్చరించింది.

చైనా వందల వేల మందిని లాక్‌డౌన్‌లో ఉంచితే.. ఐరోపా వ్యాప్తంగానూ, అనేక యూఎస్ రాష్ట్రాల్లోనూ కొత్త గరిష్టాలను తాకినట్లు రికార్డులు చెబుతున్నాయి.

కోవిడ్-19 ఉప్పెనలు ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించాయి. చాలా దేశాలను ఆర్థికంగా కుంగదీశాయి. అయినప్పటికీ వ్యైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి కఠిన ఆంక్షలు విధించారు. ఫ్రాన్స్ కంపెనీలను వారానికి కనీసం మూడు రోజులు ఇంటి నుండి పని చేయాలని కంపెనీలను ఆదేశించింది. యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నైట్‌క్లబ్‌లను మూసివేసింది.

ఇది కూడా చదవండి: బీజేపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌

గ్లోబల్ వైరస్ హాట్‌స్పాట్‌లతో పోలిస్తే చాలా చిన్న వ్యాప్తిని ఎదుర్కొంటున్నప్పటికీ, చైనా తన “జీరో కోవిడ్” వ్యూహాన్ని సడలించలేదు. అనేక ప్రాంతాలలో స్టే-ఎట్-హోమ్ ఆర్డర్‌లను విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవడానికి పరిస్థితులకు తగ్గట్లుగా ఆంక్షలు విధిస్తున్నారు.