Jerusalem Shooting: జెరూసలేంలో బస్సుపై కాల్పులు జరిపిన గుర్తుతెలియని వ్యక్తి.. ఇద్దరి పరిస్థితి విషమం..
ఆదివారం తెల్లవారు జామున జెరూసలేంలోని ఓల్డ్ సిటీ సమీపంలో బస్సుపై ముష్కరుడు కాల్పులు జరిపాడు.

Jerusalem Shooting
Jerusalem Shooting: ఆదివారం తెల్లవారు జామున జెరూసలేంలోని ఓల్డ్ సిటీ సమీపంలో బస్సుపై ముష్కరుడు కాల్పులు జరిపాడు. గాజాలో ఇజ్రాయెల్, మిలిటెంట్ల మధ్య హింస చెలరేగిన వారం తర్వాత వచ్చిన అనుమానిత పాలస్తీనియన్ దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ లు గాయపడ్డారని పోలీసులు, వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Rakesh Jhunjhunwala: ఇండియన్ వారెన్ బఫెట్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే
ప్రార్థనలు చేసుకునే పవిత్ర స్థలంగా భావించే వెస్ట్రన్ వాల్‌కు సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలంలో నిలిపిఉంచిన కారు నుంచి బస్సుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బస్సుపై కాల్పులు జరిగిన సమయంలో బస్సు పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఈ బస్సు కింగ్ డేవిడ్ సమాధి వద్ద ఆగగానే కాల్పులు మొదలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే దర్యాప్తు ప్రారంభించడానికి బలగాలను సంఘటనా స్థలికి పంపినట్లు ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతా దళాలు కాల్పులు జరిపిన అనుమానిత వ్యక్తికోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు యాత్రికులు వెస్టర్న్ వాల్ వైపు వెళ్లకుండా తాత్కాలికంగా పోలీసులు అడ్డుకున్నారు.