ఆ బిడ్డకి తండ్రి మస్కే.. నిర్ధారణ అయింది.. బిడ్డ పేరును వెల్లడించిన రచయిత్రి సెయింట్ క్లెయిర్‌

తన బిడ్డకు తండ్రి ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అంటూ ప్రముఖ రచయిత అష్లీ సెయింట్ క్లెయిర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలన ఫోస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆ బిడ్డకి తండ్రి మస్కే.. నిర్ధారణ అయింది.. బిడ్డ పేరును వెల్లడించిన రచయిత్రి సెయింట్ క్లెయిర్‌

Elon Musk, Ashley Clair

Updated On : April 17, 2025 / 3:06 PM IST

Elon Musk: తన బిడ్డకు తండ్రి ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అంటూ ప్రముఖ రచయిత అష్లీ సెయింట్ క్లెయిర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలన ఫోస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆమె బిడ్డకు తండ్రి ఎలాన్ మస్కేనని పితృత్వ పరీక్షలో తేలింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. గతవారం ల్యాబ్‌కార్ప్ నివేదిక ఆధారంగా మస్కే ఆ బిడ్డకు తండ్రిగా నిర్ధారించబడింది. ఈ క్రమంలో  సెయింట్ క్లెయిర్‌ నిర్ధారణ ఫలితాలను బహిర్గతం చేయడంతోపాటు..  బిడ్డ పేరును రోములస్ గా ప్రకటించినట్లు నివేదిక పేర్కొంది.

 

ప్రముఖ రచయిత అష్లీ సెయింట్ క్లెయిర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ట్విటర్ పోస్టు ద్వారా.. ఎలాన్ మస్క్ ద్వారా ఇటీవల తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. తన ఐదు నెలల బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని చెప్పింది. ‘‘ఐదు నెలల క్రితం నేను ఈ ప్రపంచంలోకి మా బిడ్డను స్వాగతించాను. ఆ బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి. మా పిల్లల ప్రైవసీ, సెక్యూరిటీ కారణంగా ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఇటీవల మీడియాలో ఈ వార్తలు వస్తుండటంతో ఆ విషయాన్ని బహిర్గతం చేశానని’’ చెప్పుకొచ్చింది.

 

మార్చి29న సెయింట్ క్లెయిర్‌ డైలీ మెయిల్ ప్రచురించిన ఒక వీడియోలో కనిపించారు. మస్క్ నుంచి తనకు అందుతున్న పిల్లల సంరక్షణకు చెల్లింపులు తగ్గాయని, ఈ కారణంగా తాను తన వాహనాన్ని అమ్ముతున్నట్లు పేర్కొంది. సెయింట్ క్లెయిర్‌ వాదనలపై మార్చి 31న సోషల్ మీడియా ద్వారా మస్క్ స్పందించారు. అయితే, ఆమె వాదనను మస్క్ తోసిపుచ్చాడు. క్లెయిర్ మాట్లాడిన వీడియోను రాజకీయ వ్యాఖ్యత లారా లూమర్ చేసిన ట్వీట్ కు మస్క్ స్పందిస్తూ.. ఆ బిడ్డ నాదోకాదో తెలియదు. కానీ, ఆ విషయాన్ని తేల్చడానికి నేను వ్యతిరేకం కాదు అని పేర్కొన్నాడు. కోర్టు ఆదేశించిన పితృత్వ పరీక్షలో ఇప్పుడు ఆయనే తండ్రి అని నిర్ధారించబడింది.

 

టిఫనీ ఫాంగ్‌ ఎవరు.. తన బిడ్డను కనివ్వమని మస్క్ కోరాడా..
మస్క్ పై మరో ఆరోపణ వచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. క్రిప్టో ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూబర్ టిఫనీ ఫాంగ్‌ను పిల్లల కోసం మస్క్‌ సంప్రదించారని, అయితే ఆ సందేశాలను బహిర్గతం చేయడంతో ఫాంగ్‌ను ఆయన అన్‌ఫాలో చేశారని పేర్కొంది. ఫాంగ్ క్రిప్టో సోషల్ మీడియాలో పాపుల్ వ్యక్తి. ఎక్స్ లో 335,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో 48,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె అనేక మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది.

 

గత సంవత్సరం ‘ఎక్స్’లో మస్క్ ఫాంగ్ తో మాట్లాడటం ప్రారంభించాడని, ఆమె పోస్ట్ లను తరచుగా లైక్ చేయడం, వాటికి రీపోస్టులు ఇవ్వడం ప్రారంభించాడని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో పేర్కొంది. మస్క్ ప్రమేయంతో ఫాంగ్ తన వ్యూవర్స్ ను వేగంగా పెంచడానికి సహాయపడిందని, ఆదాయం కూడా పెరిగిందని నివేదిక పేర్కొంది. అయితే, తనకు బిడ్డను కనివ్వాలని మస్క్ కోరడం జరిగిందని, ఆ ప్రతిపాదనకు ఫాగ్ నో చెప్పడంతో తనను అన్ ఫాలో చేసినట్లు పేర్కొన్నట్లు నివేదికలో వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.