Elon Musk: బుల్‌షిట్.. నాకు ఆమెతో అటువంటి సంబంధం లేదు – ఎలన్ మస్క్

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. తన వ్యాపారాలతోనే కాదు పర్సనల్ లైఫ్‌తోనూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఈ క్రమంలోనే మస్క్‌కు గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య మధ్య ఎఫైర్ ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించారు. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్‌ కంపెనీలలో తన పెట్టుబడులను విక్రయించాలంటూ తన అడ్వైజర్లకు సూచించారంటూ పేర్కొంది.

Elon Musk: బుల్‌షిట్.. నాకు ఆమెతో అటువంటి సంబంధం లేదు – ఎలన్ మస్క్

Elon Musk

Updated On : July 25, 2022 / 10:30 AM IST

 

Elon Musk: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. తన వ్యాపారాలతోనే కాదు పర్సనల్ లైఫ్‌తోనూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఈ క్రమంలోనే మస్క్‌కు గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య మధ్య ఎఫైర్ ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించారు. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్‌ కంపెనీలలో తన పెట్టుబడులను విక్రయించాలంటూ తన అడ్వైజర్లకు సూచించారంటూ పేర్కొంది.

2008 ఆర్థిక సంక్షోభం సమయంలో ఎలక్ట్రిక్ కార్‌మేకర్ ఎలన్ మస్క్‌కు సాయం చేసిన బ్రిన్‌కు మధ్య సుదీర్ఘ కాల స్నేహాన్ని గుడ్ బై చెప్పేయనున్నారట. నిజానికి మస్క్ కంపెనీల్లో బ్రిన్ ఇన్వెస్ట్‌మెంట్లు ఎంతమేర ఉన్నాయో అతనికే తెలియదట.

టెస్లా కో ఫౌండర్.. మస్క్‌కు బ్రిన్ భార్య షనహన్‌కు ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. గతేడాది డిసెంబరులో షనహన్‌ను మస్క్ కలిశాడని అక్కడే వారికి ఎఫైర్ మొదలైందని పేర్కొంటున్నారు. మరో ఈవెంట్ లో బ్రిన్ ను కలిసిన మస్క్ తనను క్షమించాలని కోరినట్లు ఆ కథనంలో రాసుకొచ్చారు.

Read Also: “ఎలన్ వంటి తరాన్ని సృష్టిస్తాం. మీ వీర్యం డొనేట్ చేయండి మస్క్”

మస్క్.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ న్యూరాలింక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు జన్మించిన కవలలకు తండ్రి అయ్యాడని సంవత్సారంభంలో తెలిసింది. 2016లో మస్క్ లైంగికంగా వేధింపులకు గురిచేసిన దావాను పరిష్కరించేందుకు అతని మరో కంపెనీ స్పేస్‌ఎక్స్, ఉద్యోగికి $250,000 చెల్లించిందని మరో కథనంలో పేర్కొన్నారు.