ఆ ఇంటి రంగుతో యాక్సిడెంట్స్ : మార్చాలంటూ కోర్టులో పిటీషన్

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 07:50 AM IST
ఆ ఇంటి రంగుతో యాక్సిడెంట్స్ : మార్చాలంటూ కోర్టులో పిటీషన్

Updated On : March 4, 2019 / 7:50 AM IST

టెక్సాస్‌: ఓ యువకుడికి ఓ వింతైన అనుభవం ఎదురైంది. తన ఇంటికి ఎంతో ఇష్టమైన రంగును వేయించుకున్నాడు. స్థానికులు మాత్రం ఇంటి రంగుని మార్చేయాలంటూ కోర్టుకెక్కారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. మన ఇంటికి మనకు ఇష్టమైన రంగు వేసుకుంటాం.. చుట్టు పక్కల వారి పర్మిషన్ ఏంటి అనుకుంటాం. కచ్చితంగా లింక్ ఉంది. అమెరికాలో సీన్ ఫుల్ డిఫరెంట్. టెక్సాస్ లో నివసిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి గులాబీ (పింక్) రంగు వేశాడనే కారణంతో స్థానికులు ఏకంగా కోర్టులో ఫైట్ చేస్తున్నారు. 
 

ఆస్టిన్‌లోని టెక్సాస్‌కు చెందిన ఎమిలో రోడ్రిగుయెజ్ నాలుగేళ్ల వయస్సులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకోడానికి ఒంటినిండా సర్జరీలు చేశారు డాక్టర్స్. దురదృష్టవశాత్తు నడుము కింది భాగమంతా చచ్చుబడిపోయి.. వీల్‌ఛైర్‌కే పరిమితమైపోయాడు. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. 
ఎమిలోకి పింక్ అంటే చాలా ఇష్టం. ఎంత పిచ్చి అంటే తన ఛాతిపై ఉన్న టాటూ కూడా పింక్ రంగులోనే ఉంటుంది. 2018 నవంబరులో ఎమిలో ఓ ఇంటిని కొన్నాడు. తనకు ఇష్టమైన గులాబీ రంగు వేయించాడు. ఆఖరుకి ఇంటి పైకప్పును సైతం గులాబీ రంగుతో నింపేశాడు. అక్కడే వచ్చింది అసలు చిక్కంతా..

ఎమిలో గులాబీ రంగు ఇంటిని చూసి చుట్టుపక్కలవారు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఆ ఇంటి వైపుగానే చూస్తూ వాహనాలు నడపటంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. దీంతో స్థానికులు కోర్టుకెక్కారు. ఆ రంగు వల్ల తమ ఇళ్లు వెలవెలబోతున్నాయి. ఇంటి రంగుతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని కంప్లయింట్ చేశారు. ఈ కేసుపై ఎమిలో స్పందించాడు. ఈ ఇల్లు నాకు చాలా ఇష్టం. చుట్టుపక్కలవారికి ఇది ఎందుకు నచ్చడం లేదో అర్థం కావడం లేదు అంటున్నాడు. తన ఇంటికి హౌస్ ఓనర్స్ అసోసియేషన్ (HOA)తో సంబంధం లేదు అంటున్నాడు. త్వరలో ఇంటి ప్రహారీని కూడా గులాబీ రంగునే వేస్తానని స్పష్టం చేశాడు. మరి దీనిపై కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలి.