Eoin Morgan
Eoin Morgan Retire : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. వైట్ బాల్ రెవల్యూషన్ తెచ్చిన క్రికెటర్ గా ఇయాన్ మోర్గాన్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. తనదైన ఆటతీరుతో గుర్తింపు పొందాడు మోర్గాన్. సింగిల్స్, డబుల్స్ కన్నా పరుగుల కోసం ఎక్కువగా బౌండరీలపై ఆధారపడే ఈ ఎడంచేతి వాటం ఇంగ్లిష్ బ్యాటర్.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీ అందుకున్నాడు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
2019లో ఇంగ్లండ్ జట్టుకి వన్డే ప్రపంచకప్ అందించాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా ఉన్న మోర్గాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జట్టును నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కూడా దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు, టీ20లు ఆడిన ఆటగాడిగానే కాదు.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 35 ఏళ్ల మోర్గాన్ కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు.(Eoin Morgan Retire)
ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్సీకి స్టార్ ఆటగాడు జో రూట్ వీడ్కోలు పలకడంతో.. వన్డేల్లో కూడా మోర్గాన్ తన కెప్టెన్సీ వదిలేస్తాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కే మోర్గాన్ గుడ్‌బై చెప్పేశాడు.
Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా
మోర్గాన్ కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టుపైనా వరుసగా రెండుసార్లు డకౌటయ్యాడు. ఆపై గాయం బారిన పడటంతో ఇక ఆటకు దూరమవ్వాలనుకున్నాడు. కెరీర్ చరమాంకంలో ఇలా చేశాడంటే ఓకే.. కానీ 35 ఏళ్ల వయసులోనే క్రికెట్ నుంచి తప్పుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Ranji Trophy: సెంచరీ బాది అచ్చం కేఎల్ రాహుల్‌లా చేసిన యశ్ దుబే.. వీడియో
మోర్గాన్ స్వదేశం ఐర్లాండ్. ఆ జట్టు తరఫున 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. స్కాట్లాండ్‌తో ఆడిన తొలి వన్డేలోనే 99 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే శతకానికి ఒక్క పరుగు దూరంలో రనౌటయ్యాడు. దీంతో డెబ్యూ మ్యాచ్‌లో ఇలా 99 వద్ద ఔటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం 2007లో కెనడాపై తొలి శతకం సాధించాడు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైనా సరిగ్గా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తానికి ఐర్లాండ్ జట్టుతో మూడేళ్ల ప్రయాణంలో 23 వన్డేలు ఆడి 744 పరుగులు చేశాడు. తర్వాత 2009లో ఇంగ్లాండ్ జట్టుకు మారిపోయి సరిగ్గా పదేళ్ల తర్వాత చరిత్ర సృష్టించాడు. 2012 వరకు ఆ జట్టుకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించిన మోర్గాన్ తర్వాత కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.
Virat Kohli: విరాట్ చివరిగా సెంచరీ చేసిన సంగతి నాకైతే గుర్తు లేదు – సెహ్వాగ్
ఐర్లాండ్ లో జన్మించిన మోర్గాన్.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ గా మారాడు. 2006లో వన్డే, 2010లో టెస్ట్, 2009లో టీ20, 2010లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వన్డే, టీ20ల్లో 10వేల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2015లో కెప్టెన్ గా ఎంపికై 2019లో వరల్డ్ కప్ లో టీమ్ ను విజేతగా నిలిపాడు. వన్డేల్లో 126 మ్యాచులకు, టీ20ల్లో 72 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు మోర్గాన్.
మొత్తంగా మోర్గాన్ 248 వన్డేలు ఆడి.. 39.29 సగటుతో 7,701 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో 115 మ్యాచ్‌లు ఆడి.. 28.58 సగటుతో 2,458 పరుగులు చేశాడు. 14 హాఫ్ సెంచరీలు బాదాడు. టెస్టుల్లో 16 మ్యాచ్‌లు ఆడి 30.43 సగటుతో 2 శతకాలు, 3 అర్ధశతకాలతో 700 పరుగులు చేశాడు.