లైవ్‌లో సెట్ విరిగిపడటంతో యాంకర్ ముక్కు పగిలి..

స్టూడియోలో లైవ్ ప్రోగ్రాం నడుస్తుండగా ఓ టీవీ యాంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న సెట్ విరిగి ఒక్కసారిగా అతని వీపుపై పడింది. ESPN FC రేడియో ప్రసారం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఈఎస్పీఎన్ కొలంబియా జర్నలిస్ట్ ..

లైవ్‌లో సెట్ విరిగిపడటంతో యాంకర్ ముక్కు పగిలి..

ESPN Journalist Crushed After Studio Set Falls

Updated On : March 11, 2021 / 12:15 PM IST

ESPN Journalist: స్టూడియోలో లైవ్ ప్రోగ్రాం నడుస్తుండగా ఓ టీవీ యాంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న సెట్ విరిగి ఒక్కసారిగా అతని వీపుపై పడింది. ESPN FC రేడియో ప్రసారం కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఈఎస్పీఎన్ కొలంబియా జర్నలిస్ట్ కార్లొస్ ఆర్డుజ్ ఓ మాదిరి గాయాలతో బయటపడగలిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లైవ్ షోలో స్పోర్ట్స్ అనలిస్ట్ కూర్చీలో కూర్చొని ఉన్నాడు. అతని వెనుకే ఉన్న సెట్ ఒక్కసారిగా కూలిపోయింది. అంతే అతను డెస్క్ మీదకు హఠాత్తుగా పడిపోయాడు. వెంటనే కెమెరా షాట్ ను ఆఫ్ చేసింది. అది చూసి షాక్ అయిన హోస్ట్ లైవ్ షో నుంచి కొంచెం కూడా కదలకుండా ఉండి కమర్షియల్ యాడ్ వేసుకోమ్మని సందర్భానుగుణంగా చెప్పుకొచ్చాడు.

కాసేపటి తర్వాత స్పోర్ట్స్ యాంకర్.. చిన్నపాటి గాయాలైయ్యాయని, ముక్కు పగిలినట్లు అయిందని చెప్పాడు. అవి మినహా అతను సేఫ్ గానే ఉన్నట్లు చెప్పాడు. ఘటనపై స్పందించి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వాళ్ందరికీ థ్యాంక్స్. నేను తప్పక చెప్పాల్సి ఉంది. ేను మెడికల్ చెకప్ తర్త సేఫ్ గానే ఉన్నామని చెప్పుకొచ్చాడు.