Ethiopian Calendar : ఇదేం విచిత్రం.. మనకు 2026… వాళ్లకు మాత్రం 2018..! ఈ మిస్టరీకి కారణమేమిటంటే?
Ethiopian Calendar : ఇథియోపియాలో సంవత్సరానికి 13 నెలలు ఉంటాయి. ఇథియోపియాలో సంవత్సరంలో 12 నెలల్లోనూ 30 రోజులే ఉంటాయి. 13వ నెలలో కేవలం ఐదు లేదా ఆరు రోజులే ఉంటాయి. ఇది లీపు సంవత్సరాన్ని బట్టి ఉంటుంది.
Ethiopian Calendar
Ethiopian Calendar : ప్రపంచ దేశాలన్నీ 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. న్యూఇయర్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 2026 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. అయితే, ఒక దేశం మాత్రం ఇంకా 2018 సంవత్సరంలోనే కొనసాగుతోంది. అదే ఆఫ్రికా దేశమైన ఇథియోపియా.
Also Read : AP Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో మళ్లీ దంచికొట్టనున్న వానలు..

ఇథియోపియా దేశం ప్రజలు ప్రస్తుతం 2018 సంవత్సరంలోనే ఉన్నారు. ఇది కాస్త ఆశ్చర్యకర విషయమే అయినా.. ఇందుకు ప్రధాన కారణం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గ్రెగేరియన్ కేలండర్ విస్తృతంగా వాడకంలో ఉండగా.. ఇథియోపియా మాత్రం శతాబ్దాల నాటి సౌర కేలండర్ ‘గీజ్’ను అనుసరిస్తుంది. దీంతో గ్రెగేరియన్ కేలండర్ తో పోలిస్తే గీజ్ క్యాలండర్ ఏడు నుంచి ఎనిమిదేళ్లు వెనుకబడి ఉంటుంది. ఆ దేశంలో సెప్టెంబర్ 11న కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ లెక్కన మనకు 2025 సెప్టెంబర్ నాటికి ఇథియోపియా 2018 సెప్టెంబర్ లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నమాట.

ఇథియోపియాలో సంవత్సరానికి 13 నెలలు ఉంటాయి. ఇథియోపియాలో సంవత్సరంలో 12 నెలల్లోనూ 30 రోజులే ఉంటాయి. 13వ నెలలో కేవలం ఐదు లేదా ఆరు రోజులే ఉంటాయి. ఇది లీపు సంవత్సరాన్ని బట్టి ఉంటుంది. సమయాన్ని కూడా ఇథియోపియా ప్రజలు భిన్నంగా లెక్కిస్తారు. పొద్దున్న ఆరు గంటల నుంచి మొదలుపెట్టి 12గంటల చొప్పున రెండు భాగాలుగా విభజిస్తారు.

ఆ లెక్కల్లో తేడా వల్లనే..
గ్రెగేరియన్, గీజ్ కేలండర్‌లకు ఏసుక్రీస్తు జన్మ సంవత్సరం లెక్కల్లో తేడా వల్లనే అంతరం ఏర్పడింది. గ్రెగేరియన్ కేలండర్‌ను యూరోప్ 1582లో వాడుకలోకి తీసుకొచ్చారు. అప్పుడు దియోనిసియస్ ఎక్సిగస్ అనే సాధువు ఏసుక్రీస్తు పుట్టుక గురించి వేసిన లెక్కలపై ఆధారంగా కేలండర్ ను రూపొందించారు.ప ఈ లెక్కల ప్రకారం అది తొలి సంవత్సరం అయింది. కానీ, ఇదే సమయంలో ఇథియోపియా, ఈజిప్టులోని చర్చీలు మాత్రం అలెగ్జాండ్రియన్ క్రైస్తవ లెక్కలను అనుసరించాయి. వాటి ప్రకారం క్రీస్తు పుట్టుక కొన్నేళ్ల తరువాత జరిగింది. అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇథియోపియా సంవత్సరాల్లో తేడా ఉంటుంది. ప్రస్తుతం ఆ దేశంలో గీజ్ కేలెండర్ ను అనుసరిస్తున్న కారణంగా 2018 సంవత్సరంలోనే ఉంది.
