AP Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో మళ్లీ దంచికొట్టనున్న వానలు..

AP Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి.. పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి వాయుగుండంగా బలపడే చాన్స్ ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో మళ్లీ దంచికొట్టనున్న వానలు..

AP Rains

Updated On : January 7, 2026 / 8:26 AM IST
  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
  • నేడు వాయుగుండంగా బలపడే అవకాశం
  • తమిళనాడు తీరం వైపు కదలొచ్చని అంచనా
  • ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్

AP Rains : తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తుంది. పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. దీంతో రాత్రి, ఉదయం వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 9గంటల వరకు చలి తీవ్రత ఉంటుంది. ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది.

Also Read : Bus Accident : వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మళ్లీ మంటలు.. వంతెనపై బస్సు పూర్తిగా దగ్దం.. తెల్లవారు జామున ఘటన

భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి.. పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి వాయుగుండంగా బలపడే చాన్స్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వాయుగుండం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. అయితే, ఏపీలో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు, ఈశాన్య దిశల నుంచి క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.