Bus Accident : వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మళ్లీ మంటలు.. వంతెనపై బస్సు పూర్తిగా దగ్దం.. తెల్లవారు జామున ఘటన
Bus Accident : కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
Bus Accident
- ఏపీలో మరో బస్సు ప్రమాదం
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్దం
- తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వంతెనపై ఘటన
- డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
Bus Accident : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసేలోపే బస్సు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
Also Read : Tdp Vs Ysrcp: రెండు రాష్ట్రాల మధ్య జల జగడం.. ఏపీలోని రెండు పార్టీల మధ్య రాజకీయ రగడకు ఎలా దారితీసింది?
కొవ్వూరు ఫ్లైఓవర్‌పై వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్దమైంది. ఈ సంఘటనతో ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. బస్సు దగ్దం ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి విశాఖపట్టణం వైపు ప్రయాణిస్తుంది. బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది బస్సు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ బస్సు పూర్తిగా దగ్దమైంది.
బస్సు ప్రమాదం ఘటనతో ప్రయాణికులను వేరే బస్సుల్లో తరలించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బస్సులో మంటలు చెలరేగి అనేక మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. అయితే, ప్రస్తుతం సంక్రాంతి పండుగ వస్తుంది. పట్టణాల్లో నివాసం ఉండే ప్రజలు ఎక్కువగా సొంతగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం.. బస్సు పూర్తిగా దగ్దమైన ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది.
