Ever Given Cargo Ship : సూయిజ్ కెనాల్‌లో భారీ నౌకపై ఇసుక తుపాను ఎలా విరుచుకుపడిందంటే?

తెల్లవారుజామున హఠాత్తుగా ఇసుక తుపాను విరుచుకుపడింది. సూయిజ్ కెనాల్ గుండా సరుకులతో భారీ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ వెళ్తోంది. ఇసుక తుపాను దెబ్బకు భారీగా గాలులు వీయడంతో కార్గో నౌక ఇసుకలో చిక్కుకుపోయింది.

Ever Given Cargo Ship Hit By Strong Gust Of Wind

Ever Given Cargo Ship hit by strong gust of wind : తెల్లవారుజామున హఠాత్తుగా ఇసుక తుపాను విరుచుకుపడింది. సూయిజ్ కెనాల్ గుండా సరుకులతో భారీ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ వెళ్తోంది. ఇసుక తుపాను దెబ్బకు భారీగా గాలులు వీయడంతో కార్గో నౌక ఇసుకలో చిక్కుకుపోయింది. గత రెండురోజులుగా నౌక అంగుళం కూడా కదలని పరిస్థితి. మెరిటైమ్ ట్రాకింగ్ టెక్నాలజీ ద్వారా కార్గో నౌకను కదిలించేందుకు ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫలితం శూన్యం.

1300 చదరపు అడుగుల పొడవైన కంటైనర్ నౌకను కదిలించేందుకు రెండుసార్లు విఫలయత్నం జరిగింది. ప్రపంచదేశాలకు కీలకమైన నౌక మార్గాన్ని క్లియర్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.

పనామాకు చెందిన ఈ కార్గో నౌక మంగళవారం ఇసుక తుపాను ధాటికి చిక్కుకుంది. అప్పటినుంచి అటుగా రాకపోకలు సాగించే ఇతర నౌకలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈజిప్ట్ జలశయ మార్గంలో ఇప్పటికే 280కి పైగా నౌకలు నిలిచిపోయాయి.

ఎవర్ గివెన్ అనే కార్గో నౌక సూయిజ్ కెనాల్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఇసుక తుపాను గాలులు బలంగా తాకడంతో నౌక ఒక్కసారిగా పక్కకు తిరిగి కెనాల్ కు అడ్డంగా నిలిచింది. ఇసుక తుపాను నౌకను తాకినప్పటి దృశ్యాన్ని జపాన్ కు చెందిన శాటిలైట్ రికార్డు చేసింది.

ఆ వీడియోలో ఇసుక తుపాను గాలల తీవ్రతకు నౌక ఎలా చిక్కుకుందో వీడియోలో రికార్డు అయింది. చిక్కుకున్న నౌకలోని కంటైనర్లను మరో నౌకలో తరలించి మార్గాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.