ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నారా.. అయితే ఒబెసిటీ కన్ఫామ్

ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నారా.. అయితే ఒబెసిటీ కన్ఫామ్

Updated On : August 19, 2020 / 4:31 PM IST

సిటీలతో పాటు పల్లెటూళ్లలోనూ ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ రద్దీతో ధ్వని కాలుష్యం, గాలి కాలుష్యమే కాదు. మరోరకంగానూ ఆరోగ్యం చెడిపోతుందని కొత్త స్టడీ చెప్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ కలిసి జరిపిన స్టడీలో ఎక్కువ కాలంగా ఈ నాయీస్ పొల్యూషన్ ఉండే ప్రాంతంలో వారికి ఒబెసిటీ ప్రమాదాలు ఎక్కువని తేలింది.



అటువంటి ప్రాంతాల్లో ఉండే వారిలో బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)ని పెంచడంతో పాటు నడుం చుట్టుకొలత పెరిగేలా చేస్తుందట. ఇదంతా ట్రాఫిక్ నాయీస్ ఎక్కువగా ఉండడం వల్లేనని ఆ ప్రాంతాలే చెబుతున్నాయి.

భారీగా ట్రాఫిక్ ధ్వనులు వినిపించే ప్రాంతాల్లో ఉండేవారిలో ప్రతి 10డెసిబల్స్ సౌండ్ కు ఒబెసిటీ 2శాతం పెరుగుతూ వస్తుందని తెలిసిందని డా. శామ్యుయేల్ యుటంగ్ కై, సీనియర్ ఎపిడెమియోలజస్ట్ అంటున్నారు.



లైఫ్ స్టైల్ లో స్మోకింగ్, ఆల్కహాల్, ఫిజికల్ యాక్టివిటీ, డైట్ లు సోషల్ ఎకనామిక్ స్టేటస్ ను బట్టి మారుతుంటాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాయు కాలుష్యం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ స్టడీలో దాదాపు 5లక్షల మంది పాల్గొన్నారు. యూకే, నార్వేలతో పాటు నెదర్లాండ్స్ లో నిర్వహించిన స్టడీలో ట్రాఫిక్ నాయీస్, ఒబెసిటీ క్రమంగా పెరుగుతున్నట్లుగా ఇండికేటర్స్ ను రికార్డ్ చేయలేకపోయిందీ సర్వే.

ఈ ధ్వని కాలుష్యానికి ఒబెసిటీ ఓ కారణం కావొచ్చు కానీ, ఒబెసిటీ రావడానికి నాయీస్ పొల్యూషన్ మాత్రమే కారణం కాదు. ‘అన్ వాంటెడ్ నాయీస్ నిద్రను పాడు చేస్తుంది. దీని ద్వారా సాధారణ ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా హార్ట్ అటాక్స్, డయాబెటిస్ వచ్చేందుకు దోహదపడుతుంది. రోడ్ ట్రాఫిక్ నాయీస్ ఒత్తిడి స్థాయిని పెంచడంతో పాటు బరువు పెరిగేలా చేస్తుంది. ప్రత్యేకించి నడుం చుట్టూ కొవ్వును పెంచుతుంది’ అని లీసెస్టర్ సెంటర్ యూనివర్సిటీ డైరక్టర్ అన్నా హంసెల్ అంటున్నారు.