Warship To Pak : అధునాతన యుద్ధనౌకను పాక్ కు అందజేసిన చైనా..పాక్ తో కలిసి డ్రాగన్ కుట్ర
భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో కలిసి చైనా కుట్రలు పన్నుతోన్నట్లు కనిపిస్తోంది. భారత్‌పై దాడికి పాక్‌ను పావుగా చైనా వాడుకుంటున్నట్లు డ్రాగన్ చర్యలు తెలియజేస్తున్నాయి.

China
Warship To Pak భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో కలిసి చైనా కుట్రలు పన్నుతోన్నట్లు కనిపిస్తోంది. భారత్‌పై దాడికి పాక్‌ను పావుగా చైనా వాడుకుంటున్నట్లు డ్రాగన్ చర్యలు తెలియజేస్తున్నాయి. తాజాగా అతిపెద్ద మరియు అత్యంత అధునాతన యుద్ధనౌకను పాకిస్తాన్ కు చైనా అందజేసింది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి నింగి సహా నీటి అడుగున కూడా పోరాడగల, విస్తృతమైన నిఘా సామర్థ్యాలు కలిగిన అధునాతన యుద్ధనౌకను సోమవారం పాకిస్తాన్ కు చైనా అందజేసింది.
సోమవారం షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ యుద్ధనౌకను పాకిస్తాన్ కు చైనా అందించినట్లు చైనా మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ వెల్లడించింది. చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(CSCC) నిర్మించిన టైప్ 054A/P రకానికి చెందిన ఈ యుద్ధనౌకకు పాకిస్థాన్ నేవీ..”పీఎన్ఎస్ తుఘ్రిల్”గా నామకరణం చేసినట్లు చెప్పింది. పాక్ కోసం నిర్మిస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకల్లో పీఎన్ఎస్ తుఘ్రిల్.. మొదటిదని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. కాగా, విదేశాలకు చైనా ఇలాంటి యుద్ధనౌకను ఎగుమతి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
నౌకను పూర్తి చేయడం మరియు డెలివరీ చేయడం చైనా-పాకిస్తాన్ స్నేహం యొక్క మరొక ప్రధాన విజయం, రెండు దేశాల మధ్య అన్నిరకాల వాతావరణ వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని ఇది మరింత మెరుగుపరుస్తుంది అని చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్(CSSC) ఈ సందర్భంగా తెలిపింది.