Facebook.. Twitter అకౌంట్ హ్యాక్

Facebook.. Twitter అకౌంట్ హ్యాక్

Updated On : February 8, 2020 / 2:05 PM IST

ఫేస్‌బుక్‌కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ట్విట్టర్ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని మెయిల్ ద్వారా వెల్లడించారు. శుక్రవారం ఫేస్‌బుక్ .. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని నిర్దారించారు. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసేంజర్ లకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. థర్డ్ పార్టీ ప్లాట్ ఫాం ద్వారా ఇలా జరిగింది. 

‘వాటిపై మేము అప్రమత్తంగా ఉన్నాం. మాకు తెలిసిన వెంటనే ఆ అకౌంట్లను క్లోజ్ చేశాం. ఆ తర్వాత ఎలా హ్యాకింగ్ గురయ్యాయని తెలుసుకునే పనిచేశాం. అకౌంట్లు తిరిగి పనిచేస్తున్నాయి’ అని ట్విట్టర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ఆగష్టులో హ్యాకింగ్‌కు గురైంది. అనామక వ్యక్తి పబ్లిక్ ట్వీట్లు చేస్తుండటమే కాక, వివాదాస్పద ట్వీట్లు, బూతులను 4మిలియన్ మంది ఫాలోవర్లకు ట్వీట్ చేశాడు.