Extraterrestrial Satellite : భూమికి దగ్గరలో ఏలియన్స్..? మిస్టీరియస్ శాటిలైట్ పై నాసా క్లారిటీ

ఏలియ‌న్స్.. ఇప్పటికీ ఓ మిస్టరీనే. అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నాయి. ఏలియన్స్ గురించి ఎప్పుడూ ఇంట్రస్టింగ్ డిస్కషన్..

Extraterrestrial Satellite : ఏలియ‌న్స్.. ఇప్పటికీ ఓ మిస్టరీనే. అసలు ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నాయి. ఏలియన్స్ గురించి ఎప్పుడూ ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ఏలియన్స్ నిజమే అని కొందరు, ట్రాష్ అని మరికొందరు.. ఇలా ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉన్నారు.

AP High Court Jobs : డిగ్రీ పాస్ అయితే చాలు.. ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

కాగా, కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 2న అంతరిక్షంలో భూమికి దగ్గరగా నల్లని ఆకారంలో ఓ వస్తువు కనిపించింది. ఇది మిస్టీరియస్ శాటిలైట్ అంటూ భారీ ప్రచారం మొదలైంది. సైంటిస్టులు ‘బ్లాక్ నైట్ శాటిలైట్’ అని పేరు పెట్టారు. దీని నుంచి వింత సిగ్నల్స్ వెలువడుతున్నాయని సోషల్ మీడియాలో టాక్ స్టార్ట్ అయ్యింది. దీంతో.. ఇది గ్రహాంతరవాసులకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ గా ప్రచారం మొదలుపెట్టారు.

COVID-19 : వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఈ 4 కారణాల వల్లే కరోనా సోకుతోంది!

దీనిపై నాసా స్పందించింది. అదసలు ఏలియన్ శాటిలైట్ కాదని తేల్చేసింది. అదొక గ్రహశకలమని వివరణ ఇచ్చింది. భూమికి దగ్గరలో ఏలియన్స్ శాటిలైట్ ఏదీ లేదని నాసా స్పష్టం చేసింది.

1998లో స్పేస్‌ షెట్టల్‌ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్‌ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెబుతోంది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావొచ్చని చెబుతున్నారు. పైగా భూ కక్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా చెబుతోంది. కాబట్టి.. భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్‌ అనేది ఒట్టి ప్రచారమే అని నాసా తేల్చేసింది.

Eye Health : పొగతాగే వారికి పొంచి ఉన్న ప్రమాదం

ట్రెండింగ్ వార్తలు