AP High Court Jobs : డిగ్రీ పాస్ అయితే చాలు.. ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు..

AP High Court Jobs : డిగ్రీ పాస్ అయితే చాలు.. ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

Ap High Court Jobs

AP High Court Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 174 పోస్టులున్నాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను హైకోర్టు భర్తీ చేస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 2021 సెప్టెంబర్ 30 దరఖాస్తులకు తుది గడువు.

Harm iPhone Cameras : ఐఫోన్ యూజ‌ర్లకు ఆపిల్ వార్నింగ్.. మీ కెమెరాలు భద్రం!

అసిస్టెంట్ 71, ఎగ్జామినర్ 29, టైపిస్ట్ 35, కాపీయిస్ట్ 39 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 9

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 30

విద్యార్హతలు..
అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. కాపీయిస్ట్ పోస్టుకు టైప్‌ రైటింగ్ (ఇంగ్లీష్) హయ్యర్ గ్రేడ్‌లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ కావాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి.

Eye Health : పొగతాగే వారికి పొంచి ఉన్న ప్రమాదం

వయస్సు- 18 నుంచి 42 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎగ్జామ్ ఫీజు- ఓపెన్ కేటగిరీ, బీసీ అభ్యర్థులకు రూ.800. ఈడబ్లుఎస్ కి రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400.

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్.

పూర్తి వివరాలకు.. https://hc.ap.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.