Eye Health : పొగతాగే వారికి పొంచి ఉన్న ప్రమాదం

కంటి చూపు మెరుగుపడాలంటే పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తీసుకొనే ఫుడ్ లో A, C, E విటమిన్స్ ఉండేలా చూసుకోవాలని సూచించారు.

10TV Telugu News

ఈ డిజిటల్ యుగంలో ఎలక్ట్రిక్ వస్తువులు లేనిదే పూట గడవడం లేదు. జీవితంలో అవి ఒక భాగమై పోయాయి. విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం ఫోన్లు, ల్యాప్ టాప్స్ తో తోనే పని. ఇలా నిరంతరం వీటిని వాడటం వలన కంటి సమస్యలు వస్తున్నాయి. కళ్లు పొడిబారడం, శుక్లాలు, దృష్టిలోపం తలెత్తడం వంటి సమస్యలెన్నో మనలో చాలామంది ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 100 కోట్ల మంది తాత్కాలిక, లేదా దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేధికలో వెల్లడించింది. కంటి ఆరోగ్యం మెరుగుపడాలి అంటే పోషకాహారమే మార్గమని న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్త సూచించారు.

విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

శరీరానికి అవసరమైన విటమిన్లు అందించే ఆకారం తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అమెరికన్‌ ఆప్టోమెట్రిక్‌ అసోసియేషన్‌ ప్రకారం ‘ఎ, సి, ఇ’ విటమిన్లు శుక్లాలు, మాక్యులర్‌ డీజెనరేషన్‌ సహా కొన్ని కంటిసంబంధింత సమస్యలు నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. సిట్రిక్‌ ఫలాలు, డ్రై నట్స్‌, విత్తనాలు, చేపలు.. వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తీసుకోవడం వలన కంటి సమస్యలు తగ్గి చూపు మెరుగుపడుతుందని చెబుతున్నారు

Vitamin

 

ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు

కంటి సమస్య రాకుండా ఉండాలంటే ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని చెబుతుంటారు నేత్ర వైద్యులు.. అంతే కాదు విటమిన్ A అధికంగా ఉండే కూరగాయలు, గుడ్డు తినమంటారు. విటమిన్ A కంటికి మేలు చేస్తోంది. విటమిన్ C కూడా కంటికి చూపును మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతుంటారు. అందుకే ఆకూ కూరల, కూరగాయలు, సిట్రిక్ ఫ్రూప్ట్స్ అధికంగా తీసుకోవాలని చెబుతుంటారు. అకాడమీ ఆఫ్‌ నూట్రీషన్‌ అండ్‌ డైటిటిక్స్‌ అధ్యయనాల ప్రకారం మన ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకున్నట్లయితే యూవీ రేస్‌, రేడియేషన్‌ నుంచి కంటిచూపును కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుందని తేలింది.

Leafy Vegetables

 

 

Read More : Gujarat CM : గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్

 

మీరు ఎక్కువగా తాగాలి

నీటి ప్రాధాన్యతను అందరు దృష్టిలో ఉంచుకోవాలి.. నీరు శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు డీహైడ్రేషన్ కాకుండా చూస్తోంది. మీరు ఎంత నీరు తాగితే అంత మంచిదని వైద్యులు చెబుతుంటారు. రోజుకు 6 నుంచి 8 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే శరీరానికి సరిపడినంత నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్‌ నుంచి కాపాడటమేకాకుండా, కంటికి హానిచేసే ఇతర కారకాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.

Water

 

శరీర బరువు నియంత్రణలో ఉండాలి

కంటి చూపు మందగించడానికి శరీర బరువు కూడా ఒక కారణం. యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌ చెందిన ఆప్తాల్మాలజీ విభాగంలో జరిపిన బీవర్‌ డ్యామ్‌ ఐ అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యంపై మాడిసన్‌, స్థూలకాయం ప్రభావం కూడా ఉంటుందని వెల్లడించింది. అధికబరువు వలన కంటి లోపలి భాగం నుంచి ఒత్తిడి పెరుగుతుందని తేల్చింది. పరిమిత ఆహారం తీసుకోని శరీర బరువును కంట్రోల్ లో ఉంచుకుంటే కంటిచూపు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

Weight

 

Read More : Bigg Boss 5 Telugu : దీప్తితో ప్రేమలో షన్ను..!

ధూమపానానికి దూరంగా

దూమపానం అనేక అనర్దాలకు దారితీస్తుంది. ఉపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతే కాదు పొగవల్ల కంటిచూపు కూడా మందగిస్తుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధ్యయనాల్లో తేలింది. పొగతాగని వారితో పోల్చితే స్మోకింగ్‌ చేసేవారిలో కాంటరాక్ట్‌ వంటి కంటి సమస్యలు రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి.

Sigaret

 

ఈ సూచనలన్నీ పాటించి మీ కంటి చూపు మెరుగుపరుచుకోండి.

10TV Telugu News