Gympie-Gympie Plant : ఆత్మహత్యను ప్రేరేపించే విషపూరితమైన మొక్క గురించి మీకు తెలుసా?

మొక్కల్లో ముళ్లున్నవి, విషపూరితమైనవి ఉన్నాయని విని ఉంటారు. కానీ ఆత్మహత్యను ప్రేరేపించే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క గురించి విన్నారా?

Gympie Gympie Plant

Gympie-Gympie Plant : మొక్కల్లో కొన్ని విషపూరితమైనవి ఉంటాయని తెలుసు. కానీ ఆత్మహత్యకు ప్రేరేపించే అత్యంత ప్రమాదకరమైన మొక్క గురించి విన్నారా? అదే జిపీ-జింపీ. వినడానికి కూడా పేరు భయం కలిగిస్తోంది.

Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు

జింపీ-జింపీ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కగా నిర్ధారించారు. ఇది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను ప్రేరేపిస్తుందట. ఉర్టికేసి రేగుట కుటుంబానికి చెందిన ఈ మొక్క ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా అడవుల్లో కనిపిస్తుందట. ఇప్పుడు ఈ మొక్కను యూకేకి చెందిన బ్రిట్ అనే వ్యక్తి తన గార్డెన్‌లో పెంచుతున్నాడు. దీనిని పెంచడాన్ని సాహసంగా చెప్పవచ్చునట. 1866 లో ఈ మొక్కను మొదటిసారి కనుగొన్నప్పుడు ఓ గుర్రం ఈ మొక్కను తాకిందట. అంతే అది మతిస్థిమితం కోల్పోయిందట. రెండుగంటల పాటు తీవ్రమైన బాధతో అది మరణించిందట.

Planting of Mango Plants : మామిడి మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ మొక్కలో జుట్టును పోలిన చిన్న చిన్న సూదులు వంటివి ఉంటాయట. దానిని తాకినపుడు చర్మం మండటం, లేదా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అవుతుందట. 20 నుంచి 30 నిముషాల్లో బాధ మొదలై వారాలు లేదా నెలల పాటు ఉంటుందట. ఆ సమయంలో వ్యక్తి విపరీతమైన ఆందోళనకు గురవడంతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను కలిగి ఉంటాడట. దీని బాధ భరించలేక ఓ వ్యక్తి తనను తాను కాల్చుకున్నట్లుగా ఓ సంఘటన కూడా నమోదైందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మొక్కను పెంచుకోవడమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, సాహసం చేయడమనే చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు