Statue of Union: “అసత్య హిందూ దేవుడు”.. అంటూ హనుమంతుడిపై అమెరికాలోని ఓ రిపబ్లికన్ నేత సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై హిందువులు సహా ఇతర మతస్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీ చొరవతో 2024లో అమెరికాలోని టెక్సాస్‌లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’ నెలకొల్పారు. షుగర్ ల్యాండ్‌లో ఉన్న ఈ 90 అడుగుల హనుమాన్ విగ్రహం అత్యంత ఎత్తైన హిందూ స్మారక చిహ్నాల్లో ఒకటి. ఇది అమెరికాలో మూడో అత్యంత ఎత్తైన విగ్రహం.
ఈ విగ్రహ వీడియోను రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ పోస్ట్ చేస్తూ.. “టెక్సాస్‌లో అసత్య హిందూ దేవుడి, అసత్య విగ్రహాన్ని ఉండనిచ్చేలా.. మనం ఎందుకు అనుమతిస్తున్నాం? మనది క్రిస్టియన్ దేశం” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
“నీకు నేను మాత్రమే దేవుడిని.. ఇతర దేవుడు ఉండరాదు. నువ్వు ఆకాశంలో, భూమిలో, సముద్రంలో అలాంటి విగ్రహాలు, ఇమేజ్‌లు సృష్టించవద్దు” అని బైబిల్ వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు.
Also Read: ఏపీకి వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు జోరు వర్షాలు
డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఏఎఫ్) స్పందించింది. హిందూ వ్యతిరేకతను ప్రేరేపించేలా ఆయన కామెంట్లు ఉన్నాయని చెప్పింది.
ఆయన వ్యాఖ్యలను టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ దృష్టికి తీసుకెళ్లింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికా రాజ్యాంగం ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను ఇస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జోర్డన్ క్రౌడర్ అనే యూజర్ స్పందిస్తూ.. హిందూ కానంత మాత్రాన, ఇతర మత దేవుడు నిజమైన దేవుడు కాదనేలా కామెంట్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించాడు. వేదాలను ఏసు పుట్టకముందు 2000 సంవత్సరాల ముందే రాశారని అన్నారు. అవి అసాధారణ బుక్స్ అని, క్రిస్టియన్ మతంపై వాటి ప్రభావం స్పష్టంగా ఉందని చెప్పారు. క్రిస్టియన్ మతానికి ముందు వచ్చి, ఆ మతాన్ని ప్రభావితం చేసిన హిందూ మతాన్ని గౌరవించి అధ్యయనం చేయడం మంచిదని అన్నారు.
Why are we allowing a false statue of a false Hindu God to be here in Texas? We are a CHRISTIAN nation!pic.twitter.com/uAPJegLie0
— Alexander Duncan (@AlexDuncanTX) September 20, 2025