వాట్ యాన్ ఐడియా : బస్సునే ఇల్లుగా మార్చేశారు

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 05:39 AM IST
వాట్ యాన్ ఐడియా : బస్సునే ఇల్లుగా మార్చేశారు

Updated On : January 13, 2020 / 5:39 AM IST

ఓ బస్సును ఇల్లుగా మార్చేసుకుని హాయిగా దాంట్లోనే కాపురం పెట్టేశారు  ఫ్లోరిడాలోని దంపతులు. ఆ బస్సులో భార్య క్రిస్టిన్, తండ్రి విల్, బేడీ రోమ్, వారి పెంపుడు కుక్క రష్ కలిసి ఉంటున్నాయి. 1992 లో బ్లూ బర్డ్ ఎయిర్ ఫోర్స్ ఈ బస్సు తొలగించింది. ఆ బస్సుని విల్, క్రిస్టిన్ లు కొనుక్కున్నారు. తరువాత దాన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఇల్లుగా మార్చేసుకున్నారు. ఈ బస్సులో కిచెన్ రూమ్, బెడ్ రూమ్, ఆఫీస్ రూమ్, బేడీ కాట్,బాత్రూమ్, రూఫ్ డెక్, మాస్టర్ బెడ్ రూమ్ ఉన్నాయి.

1992 లో బ్లూ బర్డ్ ఎయిర్ ఫోర్స్ వద్ద కొన్న ఈ బస్సులో విల్, క్రిస్టిన్ 2015 లో కాలిఫోర్నియా తీరం వరకు ఇంటికోసం వెతికారు. కాని దొరకలేదు. అలా అలా వారు ఇంటికోసం తిరిగి తిరిగి ఓ సారి వారు బస్సులో నిద్ర పోతున్న సమయంలో ఈ బస్సునే మన ఇల్లుగా మార్చేసుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది క్రిస్టిన్ కు. అదే తన భర్తతో చెప్పింది. విల్ కూడా ఆలోచించాడు. ఎందుకంటే వారు అప్పటికే అప్పుల్లో ఉన్నారు. 

స్వంతగా ఇల్లు కొనుక్కోని స్థితిలో ఉన్నారు. అంతంతమాత్రం ఉద్యోగాలు. దీంతో క్రిస్టిన్ చెప్పిన ఆలోచన విల్ కు నచ్చింది. అలా వారికి ఉన్న కొద్దిపాటు వస్తువులతో బస్సులో కాపురం పెట్టేశారు. దీంతో ఇల్లు కోసం తిరగటం మానేశారు. బస్సునే ఇల్లుగా మార్చేసుకున్నారు. 

ఈ బస్సును ప్రభుత్వం వైమానిక దళంలో ఉపయోగించారు. కాగా ఓ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అంత సౌకర్యవంతంగా  ఈ బస్సును డిజైన్ చేసుకున్నారు ఈ దంపతులు. ఇప్పుడు వారికి 190 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న బస్సే సర్వస్వం. అదే ఇల్లు అదే ప్రయాణవాహనం.