Kili Paul-Neema Paul : భారతదేశానికి వచ్చేయండి.. ఆఫ్రికన్ అన్నా-చెల్లెళ్లని ఆహ్వానిస్తున్న అభిమానులు

భారతీయ దుస్తులతో వీడియో సాంగ్ చేసి అభిమానుల మనసు దోచుకుంటున్నారు ఆఫ్రికన్ అన్నా-చెల్లెలు. తాజాగా బాలీవుడ్ సాంగ్‌కి వారు వేసిన స్టెప్పులు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వారిని ఇండియాకు వచ్చేయమంటూ ఇండియన్స్ వెల్కం చెబుతున్నారు.

Kili Paul-Neema Paul

African couple going viral : టాంజినియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీలు కిలీ పాల్-నీమా పాల్‌లు బాలీవుడ్ సాంగ్‌కు ఉత్సాహంగా స్టెప్పులు వేసి నెటిజన్ల మనసు ఆకట్టుకున్నారు. భారత్‌కు వచ్చేయండంటూ ఇండియన్ ఫ్యాన్స్ వారికి వెల్కం చెబుతున్నారు.

Vijay Antony : బిచ్చగాడు మహేష్ బాబుకి సూట్ అవుతుంది.. విజయ్ ఆంటోని వ్యాఖ్యలు వైరల్.. మహేష్ అభిమానులు ఏమన్నారో తెలుసా?

కిలీ పాల్ 5 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో సూపర్ హిట్ సాంగ్స్ అందిస్తుంటాడు. అతని లిప్-సింక్ మరియు డ్యాన్స్ వీడియోలను నెటిజన్స్ అభిమానిస్తారు. రీసెంట్‌గా కిలీ మరియు అతని సోదరి నీమా పాల్ ఇండియాలోని అభిమానుల కోసం ఒక వీడియోను రిలీజ్ చేశారు.. వీరిద్దరూ జోష్ చిత్రంలోని ‘హై మేరా దిల్’ అనే పాటకు స్టెప్పులు వేశారు. ఇండియన్ డ్రెస్సింగ్‌తో బాలీవుడ్ పాటకు వీరు వేసిన స్టెప్పులు ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్నాయి. ఈ పాటలో కిలీ కుర్తా మరియు పైజామా కాంబో ధరించగా, నీమా లెహంగా-చోలీని వేసుకుంది. ఈ పాటలో స్క్రీన్ మీద ఐశ్వర్యరాయ్ మరియు చంద్రచూర్ సింగ్ నటించారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

Stray Dogs : OMG.. కుక్కలకు ఆహారం పెడుతోందని వృద్ధురాలిని చితక్కొట్టారు, వీడియో వైరల్

ఇక ఈ వీడియోని చూసి ‘మీరు ఆఫ్రికా విడిచిపెట్టి భారతదేశానికి రావాలని ఒకరు.. నీమా మీరు అద్భుతం అని ఇంకొకరు’.. కామెంట్లు పెడుతూ హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలతో రెస్పాండ్ అవుతున్నారు. ఇలా ఆఫ్రికన్ అన్నా-చెల్లెలు తమ వీడియో సాంగ్స్‌తో భారతీయుల మనసు దోచుకుంటున్నారు.