Stray Dogs : OMG.. కుక్కలకు ఆహారం పెడుతోందని వృద్ధురాలిని చితక్కొట్టారు, వీడియో వైరల్

Stray Dogs : జాలి గుణమే ఆమె పాలిటి శాపంగా మారింది. కుక్కలకు ఆహారం పెడుతోందని స్థానికులు ఆమెపై సీరియస్ అయ్యారు. అంతేకాదు గొడవపడ్డారు. ఈ క్రమంలో వృద్ధురాలిపై దాడి కూడా చేశారు.

Stray Dogs : OMG.. కుక్కలకు ఆహారం పెడుతోందని వృద్ధురాలిని చితక్కొట్టారు, వీడియో వైరల్

Stray Dogs(Photo : Google)

Elderly Woman Beaten Up : మూగజీవాలకు ఆహారం పెట్టడం కొందరికి అలవాటు. అందులోనూ వీధి కుక్కులకు తిండి పెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. వాటికి నీళ్లు, ఆహారం అందించి ప్రేమ చూపిస్తారు. ముంబైలోనూ ఓ వృద్ధురాలు ఇలానే ఆకలితో ఉన్న శునకాలు ఆహారం పెట్టేది. అయితే, ఆ జాలి గుణమే ఆమె పాలిటి శాపంగా మారింది. కుక్కలకు ఆహారం పెడుతోందని స్థానికులు ఆమెపై సీరియస్ అయ్యారు. అంతేకాదు గొడవపడ్డారు. ఈ క్రమంలో వృద్ధురాలిపై దాడి కూడా చేశారు.

ముంబైలోని మీరా రోడ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న షెర్లిన్ స్మిత్(61) అనే వృద్ధురాలిపై దాడి జరిగింది. మీరా రోడ్ లోని లక్ష్మీ పార్క్ ప్రాంతంలోని వాసుదేవ్ ప్లానెట్ కాంప్లెక్స్ వాసులు.. షెర్లిన్ తో గొడవ పెట్టుకున్నారు. కుక్కలకు ఆహారం పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ముగ్గురు మహిళలు కలిసి.. వృద్ధురాలిని దారుణంగా కొట్టారు. పెద్దావిడ అని కూడా చూడకుండా బూతులు తిడుతూ చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

”నేను ఇంట్లో ఉండగా.. వాచ్ మెన్ కాల్ చేశాడు. కిందకు రావాలని పిలిచాడు. వెంటనే నేను కిందకి వచ్చాను. అప్పటికే కొందరు మహిళలు అక్కడ ఉన్నారు. నాతో వారు గొడవకు దిగారు. బూతులు తెట్టారు. బిల్డింగ్ పరిసరాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని చెప్పారు. ఎందుకు పెట్టకూడదని నేను వారిని అడిగాను. అంతే, ముగ్గురు మహిళలు నాపై దాడి చేశారు. నా జట్టు పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో స్వల్పంగా గాయాలయ్యాయి. నా గోల్డ్ చైన్ మిస్ అయ్యింది” అని బాధితురాలు షెర్లిన్ వాపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు IPC 509,323,354,504,506 సెక్షన్ల కింద దాడికి పాల్పడ్డ ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు.

Also Read..Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?