గుడిలో గోడల్ని నాకితే కరోనా వైరస్ రాదంట!!ఇప్పుడంతా అదే చేస్తున్నారు చూడండీ..

  • Publish Date - March 3, 2020 / 11:16 AM IST

కరోనా. ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు కరోనా వ్యాపించింది. ఇరాన్ దేశానికి కూడా వ్యాపించింది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఇరాన్ ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన పనులు చేస్తున్నారు.  తమను తాము కాపాడుకోవాటానికి ఇరాన్ ప్రజలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. 

కరోనా మహమ్మారి నుంచి భగవంతుడే తమను కాపాడుతాడని నమ్ముతున్నారు. నమ్మకం మంచిదే కానీ..మూఢనమ్మకంతో ప్రజలు చేసే పనులు చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా సోకుండా చైనా ప్రజలు గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. అంతవరకూ అయితే చెప్పుకోవాల్సిన పనేలేదు.  పుణ్యక్షేత్రాలకు వెళ్లడమే కాదు..పుణ్యక్షేత్రాల్లో గోడలను,గ్రిల్స్ ను నాకుతున్నారు. అలా చేస్తే తమకు కోరాని రాదని నమ్ముతున్నారు. 

కరోనా భయంతో దేవాలయాలకు వెళ్లి అక్కడి గోడల్ని..గ్రిల్స్ లను నాకుతున్నారు. ఒకపక్క కరోనా లాలా జలం (ఉమ్మి) నుంచి అత్యంత వేగంగా విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాప్తి చెందుతుంది అన్న విషయాన్ని మరచి ఇరాన్ ప్రజలు చేస్తున్న పిచ్చి పనికి అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఎవరైనా భగవంతుడు దగ్గరకి వెళ్లి ఇలా గోడలు నాకుతారా?! అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అధికారులు మాత్రం ఆలయ గోడలను,గ్రిల్స్ ను శుభ్రం చేస్తూ ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే చర్యలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే అక్కడి ప్రజలు ఇలా గోడలు,గ్రిల్స్ నాకుతున్న దృశ్యాలకు సంబందించిన వీడియో లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం తో ఇప్పుడు ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.